సహాజంగా,కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు దాదాపు 3 నుంచి 5 వేల లీటర్ల నీరు వినియోగం అవుతోందని కేంద్రం తెలిపింది. అందుకే రైతులు ఇతర పంటల వైపు మళ్లాలని సూచించింది. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వేరుశనగ, పప్పు, నూనెగింజలు, సోయాబీన్, పత్తి, తృణధాన్యాలు, ఉద్యానపంటలను సాగు చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామంది.
Read More »మంచి జోష్ లో బాలయ్య
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు హీరోగా నటించి విడుదలైన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రం అందించిన ఘన విజయంతో చిత్రం యూనిట్ మంచి జోష్ లో ఉంది. ఈ క్రమంలో బాలయ్య బాబు మాట్లాడుతూ ఏదైతే అది అయిందని అప్పుడున్న పరిస్థితుల్లో అఖండ సినిమాను రిలీజ్ చేశామని అన్నాడు. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నడు బాలయ్య.. …
Read More »Break Fast లో మీరు ఏమి తింటున్నారు..?
Break Fast లో తీసుకున్న ఆహారమే మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉత్సాహాంగా ఉంచుతుంది. అందులో పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. 1. ఖాళీ కడుపుతో బాదం తీసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. 2. అల్పాహారం సమయంలో అరటిపండ్లు, పాలు తీసుకుంటే మంచిది. 3. పొద్దుతిరుగుడు, నువ్వులు, చియా, గుమ్మడికాయ గింజలు తినాలి. 4. ఉదయాన్నే ఒక కోడిగుడ్డు తింటే ఎముకలకు, రక్తానికి, చర్మానికి మంచిది. …
Read More »Virat Kohli అభిమానులకు షాకింగ్ న్యూస్
సౌతాఫ్రికా టూర్లో టీమిండియా ఆడనున్న 3 వన్డేల సిరీస్ కి విరాట్ కోహ్లి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ సిరీస్క అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన కోహ్లి.. వన్డేల్లో ఆడనని బీసీసీఐకి తేల్చి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు సౌతాఫ్రికా బయల్దేరడానికి ఇప్పటికే భారత జట్టు ముంబైలోని హోటల్లో ఉండగా.. కోహ్లి ఇంకా జట్టుతో చేరలేదు. కాగా, కెప్టెన్సీ విషయం టీంలో కోల్డ్ వార్కు దారి తీసిందనే చెప్పాలి.
Read More »దేశంలో కొత్తగా 5,784 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా కరోనా కేసులు 5,784 నమోదయ్యాయి. మరోవైపు 252 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 4,75,888కి చేరాయి. ఇక తాజాగా కొవిడ్ నుంచి 7,995 మంది కోలుకున్నారు. మొత్తంగా 3,41,38,763 మంది రికవరీ అయ్యారు. కాగా ప్రస్తుతం దేశంలో 88,993 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 133.8 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం విజయం
ఉమ్మడి నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం విజయం సాధించారు. మొత్తం 1233 ఓట్లు పోలవగా… 1183 ఓట్లు చెల్లాయి. చెల్లని ఓట్లు 50. గెలుపు కోటా 593 కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తమ్మీద 691 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘన విజయం సాధించారు
Read More »ఉమ్మడి ఖమ్మంలో క్రాస్ ఓటింగ్
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వాస్తవంగా 116 ఓట్లు ఉండగా.. 239 ఓట్లు పడ్డాయి. దీన్నిబట్టి ఇతర పార్టీల ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వర రావుకు ఓటేశారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు రాగా.. ఆయన రాయలపై 247 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Read More »మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS విజయం
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పంతం నెగ్గారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో సవాల్ చేశారు. ఇవాల్టి కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు వచ్చాయి. అయితే ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి 762 ఓట్లు పొంది విజయం సాధించారు.
Read More »గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి
తెలంగాణ రాష్ట్రంలోని గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2018లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మధుసూదనాచారి.. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.
Read More »హీరో అర్జున్ కు కరోనా
కరోనా మహమ్మారి మళ్లీ గుబులు పుట్టిస్తుంది. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ బేబో, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా సోకింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు క్వారంటైన్‌లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ …
Read More »