టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. పొలార్డ్ సేన నిర్దేశించిన 144 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (2) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుసెన్‌తో కలిసి రీజా హెండ్రిక్స్‌తో జట్టును విజయం దిశగా …
Read More »పూరీ,చార్మీలకు ముంబైలో వింత అనుభవం
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి పూరి, ఛార్మీ నిర్మిస్తోన్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఏకంగా ముంబైకే మకాం మార్చేశారు ఛార్మీ అండ్ పూరి. అక్కడి నుండే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ముంబై వీధుల్లో కారులో వెళుతున్న …
Read More »‘సర్కారు వారి పాట’ తాజా Update
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేష్‌బాబు, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్ జరుగుతోంది. సెట్‌లో మహిళా డ్యాన్సర్‌లతో ఆయన డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరలయింది. కీర్తిసురేష్‌తో తాను మాట్లాడుతూ ఉన్న ఫొటోను నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు.
Read More »600 ఇయ్యనోళ్లు.. 3 వేల పింఛన్ ఇస్తరా?
‘గుజరాత్‌లో రూ.600 పింఛన్ ఇయ్యనోళ్లు హుజూరాబాద్‌లో మాత్రం రూ.3వేలు ఇస్తరట. అక్కడ ఇయ్యనోళ్లు ఇక్కడ ఇస్తరా? గీ బీజేపీ మ్యానిఫెస్టో చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థమైతలే’ అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అన్ని సర్వేల్లో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని తెల్వడంతో ఓడిపోతామనే భయంతో బీజేపీవాళ్లు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో నిర్వహించిన ధూంధాంకు టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, …
Read More »పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది
అబద్ధమాడినా అతికినట్టుండాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది.. అందుకే ఏకంగా తెలంగాణ అమరవీరులను కేసీఆర్.. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా స్మరించుకోలేదంటూ నీచమైన ప్రచారానికి ఒడిగట్టారు. టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రపంచంలోని కోట్లమంది తెలంగాణ వాదులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. కేసీఆర్ ఏం మాట్లాడారో.. సభలో ఏం జరిగిందో కండ్లారా చూశారు. సమావేశం ఘనంగా జరిగిన తీరు చూసి రేవంత్‌కు ఏం మాట్లాడాలో పాలుపోలేదేమో.. …
Read More »ఈటల రాజేందర్ అబద్ధాల పరాకాష్ట
వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట! ఇప్పుడు ఈటల కూడా వంద అబద్ధాలు ఆడుతూ ఏదోవిధంగా గట్టెక్కాలని చూస్తున్నాడు. అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం ఆయనకేకాదు.. ఆయన పార్టీ బీజేపీ నేతలకు అలవాటైపోయింది. అందరికంటే రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా వెలగబెట్టిన ఈ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన్నాటినుంచీ తన ఉనికిని కాపాడుకోవడం …
Read More »ఈటలను చిత్తు చిత్తుగా ఓడించండి-గెల్లు శ్రీనుకి KU Jac సంపూర్ణ మద్దతు
యార బాలకృష్ణ అధ్యక్షతన హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కేయూ JAC చైర్మన్ బొల్లికొండవీరెందర్ KU JACకన్వినర్ కత్తెరపెల్లి దామోధర్ మాట్లాడుతూ….ఈటెల రాజేందర్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే రాజీనామా చేసాడేగాని నియోజక వర్గ అభివృద్ధి కోసం కాదని…. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలిస్తనన్న మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తూ నిరుద్యోగులనోట్లో మట్టికొడుతుందని…విద్యార్థి ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్ ని గెలిపించుకొని అభివృద్ధికి …
Read More »గూగుల్‌కు గుండెకాయ..అమెజాన్‌కు ఆయువుపట్టుగా హైదరాబాద్
గూగుల్‌కు గుండెకాయ..అమెజాన్‌కు ఆయువుపట్టుగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ కట్టుకథలకు పెట్టుబడులు రావన్నారు. ‘‘పరిశ్రమలు అంటే టాటా బిర్లాలు కాదు…కులవృత్తులు కూడా కుటీర పరిశ్రమలే. ఏడున్నర ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణలో స్వర్ణయుగం. ధరణి ఒక సంచలనం. దేశానికి దిక్సూచిగా మారింది. టీఆర్ఎస్ తెచ్చిన ప్రతి చట్టం తెలంగాణ ప్రజలకు చుట్టం. కేసీఆర్ అంటే కాలువలు..కుంటలు..చెరువులు.’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read More »టీఆర్ఎస్ ప్లీనరీలో టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఎన్నారై ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్నారని ప్రశంసించారు. రైతుబంధు, దళిత బంధు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు పాల్గొనున్నట్లు మహేశ్ బిగాల తెలిపారు. అలాగే ఎన్నారైలకు మొట్టమెదటి సారి కేసీఆర్ …
Read More »జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. దళిత బంధు కేవలం రూ.10 లక్షలిచ్చి మమ అనే కార్యక్రమం కాదు అని సీఎం అన్నారు. దళితుల బాగు గురించి అనేక ప్రయత్నాలు జరిగాయని, మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సర్పంచ్‌గా పని చేసిన కాలంలో ఆయన సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి(ఇప్పుడు రూ. 50 లక్షల విలువ) …
Read More »