జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుపతి అనే వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1,50,000 ఎల్‌వోసీ ని ఆయన భార్య ఉపేంద్రకు మంత్రి అందజేశారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఈ ఎల్‌వోసీని అందజేశారు.
Read More »ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పర్యటన
ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం భద్రంగా ఉందని నడ్డా పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హయాంలో ఇప్పటివరకూ రూ 1.35 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు.డెహ్రాడూన్, రైవాలలో మాజీ సైనికులతో నడ్డా ముచ్చటించారు. వాజ్‌పేయి …
Read More »పూజా హెగ్డేపై దర్శకుడు ఆర్‌కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై రోజా భర్త, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే సంవత్సరం ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో తెలుగు తెరకి పరిచయమైంది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్‌లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్‌తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకుంది. మళ్ళీ టాలీవుడ్‌లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో …
Read More »హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీతోపాటు 190 గ్రామాలకు జలమండలి సేవలు అందుతున్నాయని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక టెక్నాలజీతో మ్యాన్ హొళ్లలో పూడిక తొలగింపు జరుగుతున్నదని తెలిపారు. 2014కు ముందు తాగునీటి కోసం హైదరాబాద్‌లో నిత్యం ఆందోళనలు జరిగేవని, ప్రస్తుతం ఆ …
Read More »రెడ్డి హాస్టల్ భవనానికి 10 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ శివారు బుద్వెల్ లో నిర్మిస్తున్న రెడ్డి హాస్టల్ భవనానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ది నిధి నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్ధిక, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. రాజాబహాదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బుద్వెల్ లో 15 ఎకరాలు కేటాయించింది. రెడ్డి హాస్టల్ భవనం నిర్మాణానికి ఈ …
Read More »నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకుగాను మంత్రి హరీశ్ రావుకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషిచేస్తానని హరీశ్ రావు అన్నారు. అందరం కలిసి సొసైటీని ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. గత 80 ఏండ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నదని …
Read More »రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది
తెలంగాణ రైతుల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది అని తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అప్పులు లేని రైతులుగా చూడాలనేదే ప్రభుత్వ సంకల్పం అని ఆయన స్పష్టం చేశారు. 2014లో రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన వాగ్దానం మేరకు.. 35.19 లక్షల మంది రైతులకు రూ. 16144.10 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. 2018లో కూడా …
Read More »దేశంలో కొత్తగా 34,457 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి చేరిందని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 375 మంది మరణించారని వెల్లడించింది. కాగా, శుక్రవారం 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా వాటి సంఖ్య 34 వేలకు తగ్గింది. దీంతో …
Read More »3 నెలల్లోనే నా కల నిజమైంది.. సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన సీజే ఎన్వీ రమణ
అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తుల కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఇవాళ ప్రారంభించారు. ఆ సెంటర్‌కు చెందిన ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ( CJI NV Ramana ) మాట్లాడారు. తెలంగాణ చరిత్రలోనూ, హైదరాబాద్ చరిత్ర లోనూ ఈ రోజు గొప్పదినంగా నిలిచిపోతుందన్నారు. 3 నెలల సమయంలోనే తన కల నిజమవుతుందని ఎన్నడూ ఊహించలేదని సీజే తెలిపారు. తన …
Read More »ట్రెండ్ సెట్టర్ సీఎం కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
చాలా మంది ట్రెండ్‌ను ఫాలో అవుతారు. కాని కొందరు మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు. రాజకీయాల్లో కూడా అరుదుగానే ట్రెండ్ సెట్టర్స్ కనిపిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా అయనే ట్రెండ్ సెట్టర్. యస్.. దటీజ్ సీఎం కేసీఆర్. అయన ఏం చేసినా వినూత్నమే… మెదట అసాధ్యం అనిపించేలా అయన పథకాలుంటాయి.. తర్వాత అందరు ఫాలో అయ్యేలా రిజల్ట్ ఉంటుంది. పరిపాలనలో అయినా రాజకీయాల్లో అయినా… తాజాగా అన్నిపార్టీలు …
Read More »