Home / Tag Archives: slider (page 708)

Tag Archives: slider

కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలు

కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలున్నాయి..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… 1.విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. 2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 3. రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. 4. క్యాన్సర్ బారిన పడకుండా కణాలను తగ్గిస్తుంది. 5. విటమిన్ ఎ వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 6. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. 7. బరువు తగ్గుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది. 8. గర్భిణులకు ఎంతో మంచిది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఉచిత సలహాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు సీఎం కేసీఆర్ ను కోరారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పిల్లలకు జవహర్ నవోదయ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, వైరస్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చైనా వెనుకాడమని చెప్పారు …

Read More »

ఏపీలో తగ్గని కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 72,979 శాంపిల్స్ను పరీక్షించగా.. 15,284 పాజిటివ్ కేసులు వచ్చాయి. 106 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,09,105కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 10,328 మంది మృతి చెందగా.. 14,00,754 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,49,201 సాంపిల్స్న టెస్ట్ చేశారు.

Read More »

సూపర్ స్టార్ కి సోదరిగా మహానటి

దక్షిణ సినిమా ఇండస్ట్రీలో  ప్రస్తుతం కీర్తి సురేష్ క్రేజీ హీరోయిన్గా కొనసాగుతోంది. ఈ కేరళ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కీర్తి.. సూపర్ స్టార్ సినిమాలో సోదరి పాత్రకు ఓకే చెప్పిందట. రజినీకాంత్ హీరోగా శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ‘అన్నాతే’. ఈ సినిమాలో కీర్తి.. రజినీ చెల్లెలిగా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల తన షెడ్యూల్ని కూడా పూర్తి చేసుకుంది. మరోవైపు మహేశ్ ‘సర్కారువారి పాట’లో నటిస్తోంది.

Read More »

ఆనందయ్య మందుపై జగ్గుభాయ్ సంచలన ట్వీటు

అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆనందయ్య మందుపై సినీ నటులు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.. తాజాగా నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రకృతి మనల్ని కాపాడేందుకు వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందు అన్ని అనుమతులను పొంది, ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆయనను ఆశీర్వదించాలి.’ అని జగ్గుభాయ్ ట్వీట్ చేశాడు.

Read More »

బరువు పెరగాలని అనుకుంటున్నారా

బరువు పెరగాలని అనుకుంటున్నారా..అయితే ఇవి చేయండి..రోజూ కాసేపైనా వ్యాయామం చేయాలి. ఒక గ్లాసు పాలలో 6 ఖర్జూర పండ్లను 4 గంటల పాటు నానబెట్టి తర్వాత ఆ పాలను మరిగించి ఉదయం,రాత్రి తాగాలి. రోజూ గుప్పెడు వేరుశనగ పప్పు తినాలి ఒక గుప్పెడు కిస్మిస్ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం, రాత్రి తినాలి  పాలు, పన్నీర్, పప్పుధాన్యాలు, గుడ్లు తీసుకోవాలి ఒక గ్లాసు పాలలో రెండు అరటిపళ్లు, టేబుల్ స్పూన్ …

Read More »

ఈటలతో భేటీపై కిషన్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాను భేటీ అయ్యానన్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘ఇప్పటివరకు ఈటల నన్ను కలవలేదు. నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే. ఈటల, నేను 15 ఏళ్లు కలిసి పనిచేశాం. కలిస్తే తప్పేంటి? కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేం. ఎప్పుడు కలుస్తున్నామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని కిషన్ రెడ్డి అన్నారు.

Read More »

సరికొత్త పాత్రలో దీపికా

ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ – హీరోయిన్ దీపికా పదుకొణె కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో బందిపోటు రూపమతి పాత్రలో దీపిక నటించనుందని, దీనికి ‘బైజు బావ్రా’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 2022 ద్వితీయార్థంలో ఈ సినిమా ట్రాక్ ఎక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి.

Read More »

ప్రతిరోజూ 3 లవంగాలను తింటే

ప్రతిరోజూ 3 లవంగాలను తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ రోగుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయట. గ్యాస్, అసిడిటీ, నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయి. చిటికెడు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 3,821 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 23 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,60,141కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,169 మంది మరణించారు. కొత్తగా 4,298 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,18,266కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,706 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 537 నమోదయ్యాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat