Home / Tag Archives: slider (page 727)

Tag Archives: slider

పుట్ట మధు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని భీమవరంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ నుంచి పుట్టా మధు కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన సతీమణి.. కొవిడ్ నుంచి కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మధు అరెస్ట్ అయ్యారు. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనేది పోలీసులు …

Read More »

కంగనా రనౌత్ కి కరోనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.

Read More »

లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ప్రభాస్ మూవీ

‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం లేడీ డైరెక్టర్ సుధా కొంగర… డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా సుధా.. ప్రభాస్కు ఒక సోషల్ డ్రామా కథ చెప్పారట. స్టోరీ లైన్కు ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడు.. బౌండ్ స్క్రిప్ట్ విన్న తరువాత సుధా ప్రాజెక్ట్ పై తుది నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ 2023 వరకు ఇప్పటికే ఓకే చెప్పిన పాన్ ఇండియా ప్రాజెక్టులతో …

Read More »

తెలంగాణలో రెండు వారాల్లోనే లక్షకు పైగా కేసులు

తెలంగాణలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రంలో గడచిన రెండు వారాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల నిర్వహణ మరో పెద్ద సమస్యగా మారింది. టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. టెస్ట్ జరగకపోవడంతో అందరితో కలిసి ఉంటున్నారు.. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.

Read More »

18ఏళ్ల పైబడినవారికి ఎప్పుడంటే టీకా.?

తెలంగాణలో కొవిడ్ టీకాలలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. 18ఏళ్లు దాటినవారు మరికొన్ని రోజులు ఆగాల్సివస్తోంది. ఈ నెల 15 వరకు స్లాట్ బుకింగ్ ఉండదని, తర్వాత పరిస్థితుల్ని బట్టీ నిర్ణయిస్తామని వైద్యారోగ్యశాఖ చెప్పింది. ఆర్డర్ చేసినన్ని డోసులు వస్తే 18ఏళ్ల వారికి టీకాలు ఇవ్వనున్నారు. ఇక నేటి నుంచి రెండో డోసు కోసం స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చు.

Read More »

రూ.6 కోట్ల 75 లక్షలతో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్, మంత్రుల భద్రత మరింత పెరగనుంది. రూ.6 కోట్ల 75 లక్షలతో ఏపీ సర్కారు 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయనుంది. టయోటా ఫార్చూనర్ వాహనాలు ఒక్కోటి రూ.34.10 లక్షలకు కొనుగోలు చేయనున్నారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేందుకు మరో రూ.33.40 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. వీటిని సీఎం, మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ పోలీసు అధికారులు వినియోగించనున్నారు.

Read More »

ఏపీలో మామిడి పండ్లకు బలే గిరాకీ

కరోనా కష్టకాలంలోనూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మామిడి ఎగుమతులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. బంగినపల్లి, సువర్ణ రేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సువర్ణ రేఖ మామిడిని దక్షిణ కొరియాకు తొలిసారి ఎగుమతి చేశారు. విదేశాలకు, వివిధ రాష్ట్రాలకు మామిడి రవాణా అవుతోంది

Read More »

ఈ కరోనా లక్షణాలుంటే..?

కరోనా విషయంలో వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరించారు. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలన్నారు. 1. ముఖం, పెదవులు, గోర్లు నీలి రంగులోకి మారడం 2. ఛాతిలో నొప్పి అనిపించడం 3. ఆయాసం, శ్వాస సమస్యలు 4. దగ్గు ఎక్కువ కావడం 5. అలసట ఎక్కువ ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు.

Read More »

తెలంగాణలో ఈ నెల 15 వరకు కొవిడ్‌ టీకా మొదటి డోసు నిలిపివేత

తెలంగాణ రాష్ట్రంలో  కొవిడ్‌ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయంఈ నెల 15 వరకు కొవిడ్‌ టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత ఉంది.రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారు.మొదటి డోసు వ్యాక్సినేషన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Read More »

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు

కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్‌ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ అవసరం అవుతున్నాయి. ఏ దవాఖానలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు, వివరాలు ప్రభుత్వ దవాఖానలు టిమ్స్‌, గచ్చిబౌలి – 9494902900 గాంధీ హాస్పిటల్‌ – 9392249569, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat