Home / Tag Archives: slider (page 755)

Tag Archives: slider

దేశంలో కరోనా కల్లోలం

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్‌-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం …

Read More »

మత్తెక్కిస్తున్న ఇస్మార్ట్ భామ

ఇటీవల విడుదలైన రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ఇస్మార్ట్ బ్యూటీ న‌భా నటేష్‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ అమ్మడు న‌న్ను దోచుకుందువటే చిత్రంతో కుర్రకారు హృదయాలు దోచుకుంది. ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రాల్లో నటించిన ఈ అమ్మ‌డికి ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం అందించిన స‌క్సెస్ మ‌రే చిత్రం …

Read More »

రైతుల పాదాలు క‌డుగుతున్నాం : ‌సీఎం కేసీఆర్

గోదావ‌రిపై కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి.. రైతుల పాదాల‌ను క‌డుగుతున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగ‌ర్ ఆయ‌క‌ట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామ‌న్నారు. కాళేశ్వ‌రంలో రైతులు కేరింత‌లు కొట్టిన‌ట్లే.. సాగ‌ర్లో కూడా రైతులు, ప్ర‌జ‌లు కేరింత‌లు కొట్టాలి. గోదావ‌రిలో పుష్క‌లంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశ‌న‌మై ఆత్మ‌హ‌త్య‌ల పాలైందంటే …

Read More »

రేషన్ కార్డులపై సీఎం కేసీఆర్ శుభవార్త

కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ‌త్వ‌ర‌లోనే కొత్త రేష‌న్ కార్డులు మంజూరు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 57 ఏండ్ల వ‌య‌సు ఉన్న వారికి పెన్ష‌న్లు కూడా త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌ని చెప్పారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. ప‌ల్లె ప్ర‌గ‌తితో గ్రామాల్లో అద్భుత‌మైన ప్ర‌గతి సాధించామ‌న్నారు. హ‌రిత‌హారం, ప‌ల్లె ప్ర‌కృతి …

Read More »

అచ్చంపేట అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శ్రీ‌కారం

అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ‌కారం చుట్టారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్క‌ర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ …

Read More »

తెలంగాణలో కొత్తగా 3,037 కరోనా కేసులు

తెలంగాణలో  కొత్త‌గా 3037 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. బుధ‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎనిమిది మంది బాధితులు మ‌ర‌ణించ‌గా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి. ఇందులో 1788 మంది బాధితులు వైర‌స్‌వ‌ల్ల మ‌ర‌ణించ‌గా, మ‌రో 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 27,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 18,685 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. కొత్త‌గా …

Read More »

తెలంగాణలో ఇప్పటివరకు కట్టినవి డబుల్‌ ఇండ్లు 1.56 లక్షలు

తెలంగాణ రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకంతో లక్షల మంది సొంతింటి కల సాకారం అవుతున్నది. 2016లో పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,56,573 ఇండ్లు కట్టించింది. ఇందులో 1,02,260 ఇండ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా, 54,313 ఇండ్ల నిర్మాణం వందశాతం పూర్తయింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 2,86,057 ఇండ్లు మంజూరవగా ప్రభుత్వం రూ.10,054.94 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన ఇండ్ల నిర్మాణం …

Read More »

దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులు

దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.మంగళవారం ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4రోజులపాటు వరుస సెలవులు …

Read More »

పవన్ పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ పాత్రకు ఎటువంటి స్పందన వస్తుందో తెలియంది కాదు. తాజాగా వకీల్‌ సాబ్‌ చిత్రంలోని తన పాత్ర గురించి, అలాగే తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..  ప్రేక్షకులు …

Read More »

తెలంగాణ  ప్రజ‌ల‌కు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ  రాష్ట్ర ప్రజ‌ల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ప్లవ‌నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.నీరు స‌మృద్ధిగా ప్రవ‌హించ‌డం ఈ సంవ‌త్సర ప్రాధాన్యంగా పంచాంగం చెప్తున్న ‌నేప‌థ్యంలో తెలంగాణ వ్యవ‌సాయానికి సాగునీరు మ‌రింతగా లభించ‌నుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంద‌రూ ఉగాది పండుగ‌ను ఆనందోత్సాహాల మధ్య కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ జ‌రుపుకోవాల‌ని కోరారు. తెలుగు సంవ‌త్సరంలో ప్రజ‌లంద‌రూ ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.క‌రోనా మ‌హమ్మారిని ధైర్యం ఎదుర్కొని విజ‌యం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat