తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 32,198 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది..కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,153కి చేరింది. ఇందులో 1,769 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 633 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2,96,740 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,644కి చేరింది
Read More »బొప్పాయితో బోలెడు లాభాలు
బొప్పాయితో బోలెడు లాభాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందామా మరి..? బరువు తగ్గుతారు కడుపులో మంట తగ్గుతుంది కంటిచూపుకు దివ్య ఔషధం రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Read More »భారీగా పెరిగిన పసిడి ధరలు
అంతర్జాతీయంగా పెరిగిన ధరల ప్రభావంతో దేశంలో కూడా ఇవాళ పసిడి ధరలు భారీగా పెరిగాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.320 పెరిగి రూ. 45,820గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి రూ.42,000గా ఉంది ఇక కేజీ వెండి రూ.900 పెరిగి రూ.71,000గా ఉంది.
Read More »రవితేజ సరసన ఆ “అందాల రాక్షసి”-ఎవరు ఆ బ్యూటీ..?
యువహీరో శ్రీవిష్ణు హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘గాలి సంపత్’. ఈ మూవీ మార్చి పదకోండు తారీఖున రిలీజ్ కాబోతుంది. ఇందులో లవ్లీ సింగ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. తొలి మూవీ విడుదల కాకముందే ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఇద్దరు కథానాయికల్లో ఓ …
Read More »కరోనా వచ్చి తగ్గాక 3 నెలల పాటు “దానికి దూరంగా” ఉండాలి..లేకపోతే..?
కరోనా వచ్చి తగ్గాక 3 నెలలపాటు సంతానం కోసం ప్రయత్నాలు చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు అలా చేస్తే గర్భస్రావం జరిగే ముప్పుందని హెచ్చరిస్తున్నారు వైరస్ వల్ల సంతాన సాఫల్య తపై ప్రభావం పడటమే కారణం. ముఖ్యంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతోందని, ఉన్న కణాల్లో చురుకుదనం లోపించి కదలికలు తగ్గుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు కరోనా నుంచి కోలుకున్న 39శాతం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు
Read More »మొక్కలు నాటడంలో తెలంగాణకు ప్రథమస్థానం
దేశంలో మొక్కలు నాటడంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమస్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా 2019-20 ఆర్థిక ఏడాదిలో దేశంలో 150.23కోట్ల మొక్కలు నాటడం జరిగింది.. అందులో తెలంగాణ రాష్ట్రం లోనే 38.17కోట్లు నాటినట్లు తెలిపింది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (34.54కోట్లు), ఉత్తరప్రదేశ్ (22.59కోట్లు) ఆంధ్రప్రదేశ్ (17.05కోట్లు) ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ చంద్రశేఖర్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు. కేంద్రమంత్రి సుప్రియో సమాధానమిచ్చారు
Read More »పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు-2021 – ‘పీపుల్స్ పల్స్’ సర్వే నివేదిక:
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యంగా కన్పిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం. పశ్చిమ బెంగాల్ లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, …
Read More »చంద్రగిరిలో చరిత్ర సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
ఏపీలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి విధితమే..ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో మెజార్టీ పంచాయతీల్లో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది..ఇందులో భాగంగా నియోజకవర్గంలో మొత్తం 107గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో 105గ్రామ పంచాయతీల్లో విజయ దుందుభి మ్రోగించింది.. అయితే ప్రధాన ప్రతిపక్ష …
Read More »జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఏలూరులో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 25వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్డ్రా చేయించారు. అందుకే జనసేన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నా, టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీ ప్రధాన శత్రువు. వైసీపీ ఓటమికి ఇరు పార్టీల …
Read More »ఏపీలో త్వరలో మెగా డీఎస్సీ,టెట్ నోటిఫికెషన్స్
ఏపీలో మెగా డీఎస్సీ, డీఎస్సీ, టెట్ నిర్వహణపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే వీటి నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీనిపై కసరత్తు చేస్తున్నాముని, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది. అటు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రస్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సీబీఎస్ఈ అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ కు మించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంది
Read More »