Home / Tag Archives: slider (page 827)

Tag Archives: slider

తెలంగాణలో రేపటి నుండి బడి గంట

కరోనా నేపథ్యంలో మూతబడిన విద్యాసంస్థలు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9 ఆపై తరగతులకు ప్రత్యక్షబోధనకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తోపాటు వృత్తివిద్యా కళాశాలలన్నీ తెరుచుకోబోతున్నాయి. మొత్తంగా 30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశాలున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 70శాతానికి పైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్టు అధికారులు చెప్తున్నారు. సమ్మతి …

Read More »

గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి హర్షిత వెంకటేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు ప్రీతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన బుల్లితెర నటి హర్షిత వెంకటేష్.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. మనకు స్థలం లేని పక్షంలో టెర్రస్ గార్డెన్స్, హౌస్ …

Read More »

తెలంగాణ అసెంబ్లీలో మ‌హాత్ముడికి ఘ‌న నివాళులు

తెలంగాణ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఘ‌న నివాళుల‌ర్పించారు. మ‌హ్మాతుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన వారిలో శాస‌న‌స‌భ‌ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మండ‌లి ‌చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి గారు, హోంమంత్రి మ‌హముద్ అలీ గారు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ గారు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత‌ మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు గారు, నేతి …

Read More »

భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్న పూజా హెగ్డే

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్‌ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. దీంతో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు …

Read More »

కరోనా వ్యాక్సిన్ పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో   రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కామినేని కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్నారు. శుక్రవారం వ్యాక్సిన్‌ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నందుకు గర్వంగా భావిస్తున్నానని, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లంతా ముందుకు వచ్చి సురక్షితమైన వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఉపాసన సూచించారు. మహమ్మారిపై ఒక జాతిగా మనమంతా ఐక్యంగా పోరాటం చేయాలన్నారు.

Read More »

చిన్నారి వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి  ఔదార్యాన్ని చాటుకున్నారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారి వైద్యం కోసం ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌కు వారం రోజుల క్రితమే స్పందించిన ఆయన, సీఎం సహాయ నిధి నుంచి శుక్రవారం రూ.3.50 లక్షల ఆర్థికసాయం అందించారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని చిన్నబోనాలకు చెందిన వ్యవసాయ కూలీ కాశెట్టి అనిల్‌-సౌమ్య దంపతుల రెండున్నరేళ్ల కూతురు ఆద్యశ్రీ కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది. ఒక్కగానొక్క …

Read More »

తరగతి గదిల్లోకి 50 శాతం విద్యార్థులకు మాత్రమే అనుమతి

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిల్లోకి 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి తన కార్యాలయంలో ఉన్నతవిద్యా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కళాశాల తరగతులవారీగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని ఆదేశించారు. కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలను తరచూ తనిఖీచేయాలని సూచించారు. ప్రతిరోజు శానిటైజేషన్‌ …

Read More »

తెలంగాణలో కొత్తగా 186కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రాత్రి గం.8 వరకు కొత్తగా 186 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,306కు చేరింది. ఇక నిన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,598కు పెరిగింది. ఇప్పటివరకు 2,90,354 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 2,354 యాక్టివ్ కేసులున్నాయి

Read More »

నక్క తోక తొక్కిన ప్రగ్యా

యువహీరో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కే ‘అంతిమ్’లో సల్మాన్ కు జోడీగా ప్రగ్యా నటించనుందని సమాచారం. కాగా ప్రస్తుతం బోయపాటి-బాలకృష్ణ మూవీలో ఈమె నటిస్తోంది

Read More »

గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. గాంధీ అహింస సత్యాగ్రహం దీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కీర్తించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెప్తుందని అన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat