మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` పాత్రలో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చెర్రీ సరసన నటించే హీరోయిన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. దీంతో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఈ పాత్ర కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తాజా సమాచారం.
ఈ సినిమా కోసం పూజ తక్కువ కాల్షీట్లు కేటాయిస్తే సరిపోతుంది. అయినప్పటికీ పూజ రెగ్యులర్ సినిమాల తరహాలోనే పారితోషికం అడిగిందట. దానికి `ఆచార్య` యూనిట్ ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.