ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌లో మార్కస్ హారి్‌సకు చోటు దక్కింది. గాయపడిన వార్నర్ స్థానంలో అతడు టీమ్‌లోకి వచ్చాడు. వార్నర్‌తోపాటు విల్ పుకోవ్‌స్కీ భారత్‌తో తొలి టెస్టుకు దూరమయ్యారు. వార్నర్‌కు గజ్జల్లో గాయమైంది.. టీమిండియాతో పింక్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుకోవ్‌స్కీ కంకషన్‌కు గురయ్యాడు. అయితే, వీరిద్దరూ బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులో ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది..
Read More »లిప్ లాక్ నుండి తప్పించుకున్న సాయిపల్లవి
ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి తర్వాత తెలుగులో ‘ఎంసీఏ, పడిపడిలేచె మనసు’ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళ, మలయాళ చిత్రాల్లోనూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తమిళంలో రూపొందిన వెబ్ సిరీస్ అంథాలజీ ‘పావకథైగల్’లోని ఓ పార్ట్‌లో సాయిపల్లవి నటించింది. ఈ అంథాలజీలో నాలుగు కథలుంటాయి. ఒక్కొక్క కథను ఒక్కొక్క దర్శకుడు తెరకెక్కించారు. సాయిపల్లవితో పాటు ప్రకాశ్‌రాజ్, హరి నటించిన కథాభాగాన్ని వెట్రి …
Read More »రాజ్‌నాథ్ సింగ్ తో కంగనా భేటీ
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆదివారం కంగనా రనౌత్ కలిశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ, ‘తేజస్’ చిత్రబృంద సభ్యులు ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ‘తేజస్’లో కంగనా రనౌత్ పైలెట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్ర్కిప్ట్‌ను రక్షణ మంత్రికి అందజేయడంతో పాటు ఆయన ఆశీర్వాదాలు, సినిమాకు కావాల్సిన అనుమతులు కోరినట్టు కంగనా తెలిపారు.
Read More »పార్టీ మార్పుపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై సీనియర్ నేత, మాజీమంత్రి కె. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. ఆదివారం రాత్రి వికారాబాద్ జిల్లా పరిగిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీనియర్లు, జూనియర్లంతా సమన్వయంతో కాంగ్రె్‌సను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మీరు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై జానారెడ్డి సున్నితంగా స్పందించారు. …
Read More »ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 506 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 63,873 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 506 మంది వైరస్ బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 104, గుంటూరులో 69, పశ్చిమగోదావరిలో 66, కృష్ణాలో 59 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,75,531 మంది కరోనా బారినపడగా, 8,63,508 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,966 మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »రోహిత్‌శర్మ అరుదైన ఘనతకు మూడేళ్లు!
డిసెంబరు 13, 2017.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ జీవితంలో మర్చిపోలేని రోజు. మొహాలీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ చెలరేగిపోయాడు. అజేయ డబుల్ సెంచరీ (208)తో కదం తొక్కాడు. ఫలితంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనతకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్టార్‌స్పోర్ట్స్’ ట్వీట్ చేయగా, రోహిత్ బదులిస్తూ.. మరిన్ని సెంచరీలు వస్తాయని బదులిచ్చాడు. వన్డే క్రికెట్‌లో మొత్తం …
Read More »ప్రతిరోజు నాలుగు కప్పులు తాగితే
బరువు తగ్గేందుకు గ్రీన్ టీ ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. బ్లాక్ టీ, గ్రీన్ టీ లు రెండూ ఒకే జాతి మొక్కల నుండి లభిస్తాయి. బ్లాక్ టీ లో కంటే, గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో దాదాపు ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పాలీఫినాల్స్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేకూరుస్తాయి. కాటెచిన్, ఎపికాటెచిన్, ఎపిగాలో కాటెచిన్ గాలెట్ అనే …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సింగర్ మను
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు సినీ సంగీత దర్శకుడు కోఠి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలి లో మొక్కలు నాటిన సింగర్ మను.. ఆయువు లేనిదే మనిషే లేడు – ఆయువు ను ఇచ్చేది పచ్చని మొక్క అని తెలుపుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సింగర్ మను తెలిపారు.ఇంత …
Read More »మరోసారి బుల్లితెరపైకి జూనియర్ ఎన్టీఆర్
వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించిన అగ్ర కథానాయకుల్లో చిరంజీవి, నాగార్జున, తారక్ ఉన్నారు. వీరిలో తారక్ నేటి తరానికి చెందిన స్టార్ హీరో. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా తారక్ బుల్లితెరపై చేసిన సందడిని మరచిపోలేం. ఇప్పుడు ఆ పాత్రను నాగార్జున సమర్ధవంతంగా పోషిస్తున్నారు. అయితే తాజా సినీ వర్గాల సమాచారం మేరకు యంగ్ టైగర్ మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారట. అయితే బిగ్‌బాస్ …
Read More »తండ్రి సంజయ్ దత్ పై తనయ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితంలో పెద్ద రహస్యాలేమీ ఉండవు. డ్రగ్స్‌కి బానిస కావడం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్‌కి ఎదగడం వరకు అన్నీ విషయాలు తెలిసినవే. ‘సంజు’ పేరుతో సంజయ్ దత్ బయోపిక్‌ను కూడా తెరకెక్కించారు. ఇటీవల సంజయ్ దత్త ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డారు. అయినా ఏమాత్రం భయపడకుండా క్యాన్సర్‌ను జయించి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు సంజూ బాబా. చిన్నప్పుడు సంజయ్ …
Read More »