సిద్దిపేట జిల్లా దుద్దెడలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు శుభాభినందనలు తెలిపారు. ఐటీ రంగంలో సిద్దిపేట పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర రాజధానికి సిద్దిపేట అత్యంత సమీపంలో ఉందన్నారు. సిద్దిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. భవిష్యత్‌లో జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పలు …
Read More »తెలంగాణ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సిద్దిపేట జిల్లా పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా బలమైన పునాదులు వేసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌లను నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో …
Read More »టీఎస్ ఆర్టీసీ కార్గో సేవల్లో మరో ముందడుగు
కార్గో సేవలను ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ.. నేటి మరో ముదండగు వేయనుంది. ప్రయోగాత్మకంగా గురువారం నుంచి ఇంటికే పార్శిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఖైరతాబాద్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సుమారు మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా సేవలు అందించనున్నారు. విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. డోర్ టూ డోర్ సేవల కోసం మూడు సంస్థలను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. నగరాన్ని మూడు సెక్టార్లుగా విభజించి …
Read More »ప్రేమ పెళ్లే చేసుకుంటా-రకుల్ సంచలన వ్యాఖ్యలు-ఎవర్నీ అంటే..!
కథానాయికల ప్రేమ, పెళ్లి వార్తలు అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. పుకార్ల విషయంలో సదరు నాయికలు ప్రత్యక్షంగా స్పందించేంత వరకు నిజానిజాలేమిటో బయటపడవు. తాజాగా సీనియర్ కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రేమాయణం తాలూకు వార్తలు దక్షిణాది చిత్రసీమలో షికార్లు చేస్తున్నాయి. ఈ అమ్మడు ఓ యువహీరోతో ప్రేమలో ఉందని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, రాబోవు రెండు …
Read More »తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 643 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కు చేరింది. వైరస్ నుంచి తాజాగా 805 మంది కోలుకున్నారు.. ఇప్పటి వరకు 2,66,925 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 1482 మంది మృత్యువాతపడ్డారు. మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉండగా.. దేశంలో …
Read More »నేడు సిద్దిపేటకు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.1200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మర్కూక్ మండలం ఎర్రవల్లి నుంచి సీఎం కేసీఆర్ బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేట శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.20 గంటలకు పొన్నాలలో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11.40 గంటలకు మిట్టపల్లిలో నూతనంగా నిర్మించిన …
Read More »రాజకీయాల్లోకి రాశీఖన్నా..!
ఏడేండ్లుగా తన అందం, అభినయంతో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఢిల్లీ భామ రాశీఖన్నా. స్టార్ హీరోలు, యువ హీరోలతో నటిస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ భామ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయం చెప్పింది. ఇంతకీ ఆ విషయమేంటనుకుంటున్నారా..? రాశీఖన్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడింది. ‘చిన్నప్పటి నుంచి నాకు …
Read More »హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
మరికాసేపట్లో శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకోనుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర్శించి కోవిడ్ టీకాలపై చర్చించనున్నారు. టీకాల తయారీపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఈ బృందాలు తిలకించనున్నాయి. టీకాల పురోగతిని తెలుసుకున్న అనంతరం శాస్ర్తవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాయబారులు, హైకమిషనర్లు ఢిల్లీ బయల్దేరనున్నారు. విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో రాష్ట్ర …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం లేఖ రాశారు. పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి ఈ నెల 10న ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండటం గర్వకారణంగా ఉందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వానికి గర్వకారణమని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేపట్టాల్సి ఉండే.. ప్రస్తుతమున్న …
Read More »తొలిసారిగా కాజల్ అగర్వాల్ సరికొత్తగా
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవలే మాల్దీవుల్లో హనీమూన్ యాత్రను ముగించుకొని వచ్చింది. చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును గత నెలలో ఆమె వివాహమాడిన విషయం తెలిసిందే. హనీమూన్ ముగియడంతో ఇక సినిమాలపై దృష్టిపెట్టబోతున్నది కాజల్ అగర్వాల్. తాజాగా తమిళంలో ఆమె ఓ హారర్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి ‘ఘోస్టీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డీకే దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నలుగురు కథానాయికల్లో ఒకరిగా కాజల్ …
Read More »