కథానాయికల ప్రేమ, పెళ్లి వార్తలు అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. పుకార్ల విషయంలో సదరు నాయికలు ప్రత్యక్షంగా స్పందించేంత వరకు నిజానిజాలేమిటో బయటపడవు. తాజాగా సీనియర్ కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రేమాయణం తాలూకు వార్తలు దక్షిణాది చిత్రసీమలో షికార్లు చేస్తున్నాయి.
ఈ అమ్మడు ఓ యువహీరోతో ప్రేమలో ఉందని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని, రాబోవు రెండు సంవత్సరాలు తన డేట్స్ ఖాళీలేవని చెప్పింది.
వృత్తిపరంగా తీరిక లేకుండా గడుపుతున్నానని..ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే సమయం లేదని స్పష్టం చేసింది. రెండేళ్ల తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, అట్టహాసంగా వివాహ వేడుకను జరుపుకోవాలన్నది తన అభిమతమని తెలిపింది. ప్రేమ వివాహంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే తానే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పింది.