ఏ రాష్ట్రంలో ఇవాళ ఎన్ని కరోనా కేసులో తెలుసుకుందాం.. మహారాష్ట్రలో 7827 కరోనా కేసులు.. మొత్తం 2.54లక్షలు తమిళనాడు 4244 కరోనా కేసులు.మొత్తం 1.38లక్షలు కర్ణాటకలో 2627 కరోనా కేసులు. మొత్తం 38,843.. ఢిల్లీలో 1573 కరోనా కేసులు.. మొత్తం1.12లక్షలు ప.బెంగాల్ లో 1560 కరోనా కేసులు. మొత్తం 30,013.. గుజరాత్లో 879 కరోనా కేసులు.. మొత్తం 41,906 కేరళలో 435 కరోనా కేసులు.. మొత్తం 7913
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసుల సంఖ్య
తెలంగాణలో ఆదివారం కూడా తక్కువగానే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 34,671కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,883కు చేరుకుంది..ఇప్పటివరకు మొత్తం 22,482 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 8 మంది వైరస్ వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 356కి చేరింది. తాజా కేసుల్లో GHMC పరిధిలో …
Read More »పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రైతు బంధు పథకం కింద ఈ వానాకాలంలో పొందిన పెట్టుబడి సాయం రూ. 2,13,437ను గివ్ ఇట్ అప్(స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వడం) రైతు బంధు సమితి పేరు మీద చెక్కు రూపంలో సీఎం కేసీఆర్‌కు అందజేశారు. …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సమంత
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. తన మామ ఇచ్చిన ఛాలెంజ్ …
Read More »దటీజ్ కేసీఆర్..
అతని ప్రతీ అడుగును విమర్శ చేయడం.. వెకిలి మాటలు అనడం అతను ఉద్యమం నుండే చూసిండు.. ఇప్పుడు ఈ కొత్త బిచ్చగాళ్ళ మాటలేం తనకు కొత్తకాదు.. విమర్శలు జయించి విజయుడయ్యిండతను.. ప్రతీ విమర్షకు పనితో సమాదానం చేప్పిండు.. వెక్కిరింపులను దిక్కరించి ఒక్కడై నిలబడి దిక్కులు పెక్కటిల్లేలా ఉద్యమించి తానే దిక్కు,దిశయై పోరాటానికి తొలిపొద్దై ఆటుపోట్లను ఎదురిస్తూ కలబడి నిలడిన తాను సాగించిన పోరాటం ప్రజల కళ్ళముందే ఉంది..తెలంగాణా తానందించిన విజయమూ …
Read More »కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ-తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం.. అలాగే హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోన్న నేపధ్యంలో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మందికి పైగా కరోనా పేషంట్లు …
Read More »కరోనా భయంతో యువతిని
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయంతో బస్సులో నుంచి ఓ యువతిని(19) బయటకు డ్రైవర్ తోసేసిన ఘటన గత నెల 15వ తేదీన చోటు చేసుకోగా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఢిల్లీ నుంచి UP వెళ్తుండగా యువతి స్వల్ప అస్వస్థతకు గురైంది. అయితే బస్సు డ్రైవర్ కరోనా భయంతో ఆమెను కిందకు తోసేయగా అక్కడికక్కడే మరణించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత …
Read More »ఏపీలో ఈఎస్ఐ స్కాం కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణలో ఏసీబీ జోరు పెంచింది. మాజీ మంత్రి పితాని పీఎస్ మురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. పితాని కొడుకు సురేష్ కోసం గాలింపు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సురేష్ ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను మురళి, …
Read More »మూఢం కాదు; గాఢ నమ్మకమే!
మీరెప్పుడైనా కాళేశ్వరం గుడి చూసిండ్రా?… ఉద్యమంలో తొలినాళ్లలో మహదేవపూర్‌కు పోయినప్పుడు, ఒక రైతు కేసీఆర్‌ను అడిగిన ప్రశ్న ఇది. లేదని చెప్పగానే, ఒక ఎడ్లబండి కట్టుకొచ్చి, దాన్లో కేసీఆర్‌ను కాళేశ్వరానికి తీసుకుపోయాడు. “ఇక్కడ గంగలో సంగమం ఉంటది. స్నానం చేస్తే పుణ్యం. చేస్తరా?” అని తనే అడిగాడు. సరేనంటే అదే బండి మీద గోదావరిలోకి తీసుకుపోయాడు. దాదాపు కిలోమీటరున్నర పోతేగానీ సంగమం రాలేదు. అక్కడ ప్రాణహిత నుంచి పారుతున్న నీళ్లు …
Read More »మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎకో- టి కాలింగ్ పుస్తకావిష్కరణ
తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి రచించిన ఎకో-టి కాలింగ్ టువర్డ్స్ పీపుల్స్ సెంట్రిక్ గవర్నెన్స్ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ… తెలంగాణ పాలన ప్రజల కేంద్రంగా వారి అవసరాల కేంద్రంగా కొనసాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన తన అనుభవంతో ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా …
Read More »