తెలంగాణలో దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించే ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలులో లేదని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక …
Read More »గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా
సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం తాను హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని చెప్పారు. గాంధీ దవాఖానలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. …
Read More »మూడో బోనం నేడే
చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్‌కార్ గోవింద్‌రాజ్ తెలిపారు. కోటలో మూడో బోనం జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
Read More »మత్స్యకారులందరికీ బీమా ధీమా
మత్స్య సహాకారం సంఘాల్లో నమోదైన సభ్యులందరికీ ప్రమాద బీమా పథకం వర్తింప జేయనున్నట్టు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి మత్స్యకారులు చెల్లించాల్సిన ప్రీమియ మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తదని స్పష్టంచేశారు. మరణించిన మత్స్యకార కుటుంబాలకు శనివారం హైదరాబాద్ హరిత ప్లాజాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. మొత్తం 105 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా …
Read More »పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు
మురికివాడల స్థానంలో పేదలకు ఆత్మగౌరవంతో జీవించే ఇండ్లు కట్టించి ఇవ్వాలనే సీఎం కేసీఆర్ కల సాకారమైందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని పొట్టి శ్రీరాములు నగర్ బస్తీ లో కార్పొరేటర్ కే.హేమలత, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంతకుమారీ, తాసీల్దార్ బాలశంకర్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హౌసింగ్ ఈఈ ఎం.వెంకట్‌దాస్‌రెడ్డి, జలమండలి …
Read More »