Breaking News
Home / HYDERBAAD / పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు

పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇండ్లు

మురికివాడల స్థానంలో పేదలకు ఆత్మగౌరవంతో జీవించే ఇండ్లు కట్టించి ఇవ్వాలనే సీఎం కేసీఆర్‌ కల సాకారమైందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

మంగళవారం బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌లోని పొట్టి శ్రీరాములు నగర్‌ బస్తీ లో కార్పొరేటర్‌ కే.హేమలత, సికింద్రాబాద్‌ ఆర్డీఓ వసంతకుమారీ, తాసీల్దార్‌ బాలశంకర్‌, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాస్‌ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హౌసింగ్‌ ఈఈ ఎం.వెంకట్‌దాస్‌రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డితో కలిసి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల సముదాయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 ఏండ్లుగా ఇరుకైన ఇండ్లలో జీవించిన పీఏస్‌నగర్‌ బస్తీవాసుల కష్టాలు ఇప్పుడు తొలగిపోయాయన్నారు. రూ.14 కోట్లతో 162 ఇండ్లను సకల సదుపాయాలతో నిర్మించామన్నారు. ఈనెల 28వ తేదీన లబ్ధ్దిదారులకు అందజేయనున్నామని ఆయన తెలిపారు.

ఇండ్ల ఆవరణలో నిర్మించిన దుకాణాలను కూడా లాటరీ పద్ధ్దతిలో స్థానికులకే కేటాయిస్తామన్నారు. ఇండ్ల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేలా కే.లక్ష్మీపతి, ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, దేశపాక శ్రీనివాస్‌, బి.అరుణ్‌ గౌడ్‌తో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri