ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల …
Read More »ఏపీ ఒకప్పటి బీహార్, యూపీ మాదిరిగా ఉంది-దేవినేని
ఏపీ ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నడూ లేని అరాచకానికి అడుగే దూరమంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని జగన్‌ను ప్రశ్నించారు. ‘‘పై స్థాయిలోనే ధిక్కారం, లెక్కలేని స్వరం, కింది స్థాయిలో పతాక స్థాయికి దౌర్జన్యాలు, ఉన్నతాధికారులనూ నిలబెట్టి బెదిరించడమే, కప్పం కట్టకపోతే భూములు వెనక్కి, దళితులపై దాడులు. ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తున్న ఏపీ, ఎన్నడూలేని అరాచకానికి అడుగే …
Read More »టీడీపీ నేతకు సుప్రీం షాక్
డీడీల కుంభకోణం కేసులో టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. కందికుంట కేసు మంగళవారం జస్టిస్ ఎ.ఎం ఖన్విల్‌ఖర్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తులు.. …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఏపీ, తెలంగాణలోని నేతలూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు కరోనా సోకగా, తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ కు వెళ్లిపోయారు.
Read More »ప్రధాని మోదీకి బాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. వైకాపా ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని… ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని …
Read More »సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదు
ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల జరిగిన అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపీసీ సెక్షన్ 505(2), 500ల కింద కేసు నమోదు చేశారు
Read More »సాగునీటి ప్రాజెక్టులపై బాబు రెండు కళ్ల సిద్దాంతం
తాము అధికారంలో వున్నపుడు ప్రజలకోసం చేసిందేమి లేకపోగా, సాగునీటి ప్రాజెక్టుల అతీగతీ పట్టించుకున్న పాపాన పోలేదు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరాన్ని కూడా అయన పట్టించుకున్నది లేదు. రాయలసీమ ఏడారిగా మారడమే ఆయన చేసిన అభివృద్ధికి అద్దం పడుతుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నపుపుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడడమే ఆయన లక్ష్యం. అప్పుడు రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాలయసీమ …
Read More »వైసీపీ నేత మృతి
కడప జిల్లాకి చెందిన మాజీ మంత్రి వైసీపీ నేత ఖలీల్ బాషా మృతి చెందారు. అనారోగ్యంతో గత వారం రోజుల క్రితం హైదరాబాద్ ఆపోలో హాస్పటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతి చెందారు. టీడీపీ హాయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి మైనార్టీ శాఖ మంత్రిగా పని చేసిన ఖలీల్ బాషా, గత ఎన్నికల ముందు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ …
Read More »వైసీపీ గూటికి టీడీపీ నేత
టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2014లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. అంతకుముందు 2009లో ప్రజారాజ్యంపార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు చేతిలో ఓడిపోయారు. తాజాగా గతేడాది 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన వైసీపీకి రాజీనామా …
Read More »ఏపీ మాజీ మంత్రి కరోనాతో మృతి
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకుపెరుగుతుండగా.. మాజీ మంత్రి, బీజేపీ నేత పి.మాణిక్యాలరావు (60) ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు. గత నెల రోజులుగా మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాకు గురై విజయవాడలోని ఓ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన.. కాసేపటిక్రితం ప్రాణాలు కోల్పోయారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2014లో తాడేపల్లిగూడె నుండి గెలుపొందారు.
Read More »