తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పట్టణప్రగతిలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శనివారం పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. పట్టణాలను సెట్‌రైట్ చేసుకొనేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగే పదిరోజుల సమయాన్ని అధికారు లు సమర్థం వినియోగించుకోవాలని, ఇది ‘మ్యాప్ యువర్ టౌన్’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పల్లె, పట్టణ …
Read More »ఈటల పై మంత్రి హారీష్ రావు ఫైర్
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరారని దుయ్యబట్టారు. ఈటల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గానికి విముక్తి కలుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ అధ్యక్షుడు నన్నబోయిన రవియాదవ్.. 200 మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు …
Read More »పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్ధిక భరోసా సీఎం సహాయ నిధి-ఎమ్మెల్యే అరూరి
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు, తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, కాజిపేట, హన్మకొండ మండలాలకు చెందిన 44మంది లబ్ధిదారులకు 16లక్షల 53వేల విలువగల చెక్కులను హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు …
Read More »హుజురాబాద్‌లో ఈటలకు షాక్
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు హుజురాబాద్ బీజేపీ నేతలు షాకిచ్చారు. ఇల్లందకుంట మండల బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శి తోడేటి జితేంద్ర గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉడుత రత్నాకర్, యువ మోర్చా అధ్యక్షుడు గుత్తికొండ పవన్‌తో పాటు 200 మంది బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 20 ఏళ్లుగా బీజేపీతో ఉన్నామని, ఈటల వైఖరిని నిరసిస్తూ ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. …
Read More »సికింద్రాబాద్ పరిధిలో శరవేగంగా అభివృద్ది పనులు
సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని, సంక్షేమ కార్యకలాపాలు, అభివృధి పనులను నిర్వహిస్తున్నామని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా మునిసిపల్ మైదానంలో రూ. 4 4 లక్షల ఖర్చుతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్టు ఇతరత్రా నిర్మాణం పనులకు శ్రీ పద్మారావు గౌడ్ శనివారం శంఖుస్థాపన చేశారు. చిలకలగుడా మునిసిపల్ మైదానాన్ని తామే పరిరక్షిస్తామని, ప్రజలకు ఉపకరించేలా తీర్చిదిద్దుతామని శ్రీ పద్మారావు …
Read More »సీఎం జగన్ పై మంత్రి పువ్వాడ ఫైర్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమ నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని, ఏపీ నీటి చౌర్యాన్ని తప్పకుండా అడ్డుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కేంద్రానికి అబద్దాలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతున్నదని విమర్శించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా …
Read More »చుక్కనీటినీ వదులుకోం – మంత్రి జగదీష్
తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటానుంచి చుక్కనీటినీ వదులుకోమని విద్యుత్తుశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి ఎన్ని ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ఎన్ భాస్కర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం …
Read More »రాజశేఖర్‌రెడ్డిని దొంగ అనక దొర అనాలా-మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ నీటిని దోచుకెళ్లిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని దొంగ అనక దొర అనాలా అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. తండ్రి తరహాలోనే నీటిని దోపిడీ చేస్తున్న వైఎస్‌జగన్‌ను గజదొంగ అనక ఇంకేం అంటారో చెప్పాలని అన్నారు. వైఎస్‌ఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పీజేఆర్ (పీ జనార్దన్‌రెడ్డి) చావుకు కారణం వైఎస్‌ఆరేనని, నీళ్ల దోపిడీ చేసింది.. భూములు తీసుకుపోయింది ఆయనేనని …
Read More »బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60 కోట్లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలో ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించిందని, అదేవిధంగా ఆలయాల్లో పూజలు, అలంకరణ కోసం ప్రత్యేకంగా రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిరహించేందుకు అన్ని శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 3లక్షల మందికి సరిపడా మాస్క్‌లు, శానిటైజర్లు …
Read More »రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలి
తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు రాని రైతులు వెంటనే ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు అందాయని ఆయన తెలిపారు. 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రైతుబంధు సొమ్మును బాకీల కింద బ్యాంకర్లు జమ చేసుకోవద్దని సూచించారు. జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి వెంటనే రైతులకు అందజేయాలని అన్నారు. రైతులకు పెట్టుబడి …
Read More »