Home / HYDERBAAD / పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక

పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక

తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా పక్కా ప్రణాళిక రూపొందించి అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పట్టణప్రగతిలో భాగంగా పట్టణాలవారీగా క్లీనింగ్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని ఆదేశించారు. ప్రగతిభవన్‌లో శనివారం పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. పట్టణాలను సెట్‌రైట్‌ చేసుకొనేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగే పదిరోజుల సమయాన్ని అధికారు లు సమర్థం వినియోగించుకోవాలని, ఇది ‘మ్యాప్‌ యువర్‌ టౌన్‌’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రిటైర్డ్‌ ఉద్యోగులు, మాజీ సైనికుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న అన్నిశాఖల రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా రూపొం దించాలన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్థికి ఖర్చు చేయడానికి మంత్రులకు రూ.2 కోట్లు, జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల ఫండ్‌ను కేటాయిస్తున్నట్టు చెప్పారు.

ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులను స్థానిక జిల్లా మంత్రి నుంచి అప్రూవల్‌ తీసుకొని ఖర్చుచేయాలని పేర్కొన్నారు. పలు ప్రభుత్వ శాఖల మధ్య ఉన్న బకాయిలను సర్దుబాటు చేసుకోకుండా పెండింగ్‌లో ఎందుకు పెడుతున్నారని కేసీఆర్‌ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వశాఖల మధ్య ఉన్న పరస్పర బకాయిలను జూలై చివరికల్లా బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ద్వారా పరిషరించాలని ఆదేశించారు. పొరపాటున కూడా శా ఖల మధ్య బిల్లులను పెండింగ్‌లో పెట్టకూడదన్నారు.