తెలంగాణలో మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 6,026 పాజిటివ్ కేసులు రికార్డవగా.. 52 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. కొత్తగా 79,824 మందికి టెస్టులు చేయగా.. 6,026 కేసులు వెలుగు చూశాయని పేర్కొంది. తాజాగా వైరస్ నుంచి 6,551 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 క్రియాశీల కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,115, …
Read More »అజిత్ సింగ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ …
Read More »తెలంగాణలో మరో ఇంటింటి సర్వే
కరోనాతో పోరులో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇందుకోసం 11,600 బృందాలను ఏర్పాటు చేసింది. వీరు కరోనా అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించనున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు.
Read More »ఈటల అలా వ్యాఖ్యానించడం సరికాదు : వినోద్ కుమార్
ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తప్పుబట్టారు. తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా ప్రజా నాయకుడు కేసీఆర్‌ను ఈటల ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ఈటల విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ఆ పథకాలను …
Read More »ఈటల ఒక మేకవన్నె పులి : మంత్రి గంగుల
ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి. బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర. ఆయన హుజురాబాద్‌కు వెళ్తే బీసీ.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్‌రెడ్డితో తాను మాట్లాడాను అని ఈటల చెబుతున్నారు. కేవలం దేవరయాంజల్ భూముల కోసమే ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి …
Read More »హైకోర్టుకు మాజీ మంత్రి ఈటల కుటుంబం
తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని హైకోర్టులో ఈటల రాజేందర్ భార్య, కొడుకు, జమునా హేచరీస్ పిటిషన్ వేశారు. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని, అచ్చంపేటలో తమ భూముల్లో అక్రమంగా సర్వే చేశారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు. ఇది నేడు విచారణకు వచ్చే అవకాశముంది.
Read More »ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఫలితాలు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) రిజల్ట్ అప్డేట్స్౼(31/60). 1: తేజావత్ హుస్సేన్(TRS) 2: మలీదు వెంకటేశ్వర్లు(CONGRESS) 3: మలీదు జగన్(INDEPENDENT) 4: దండా జ్యోతి రెడ్డి(TRS) 7: దొంగల సత్యనారాయణ(BJP) 8: లకావత్ సైదులు(CONGRESS) 9: SK జాన్ బీ(TRS) 10: చావా మాధురి(ఏకగ్రీవం-TRS) 13: కొత్తపల్లి నిరజ(TRS) 14: కురాకుల వలరాజు (TRS) 15: రావూరి కరుణ(TRS) 19: చామకూర వెంకన్న(CPI) 20: బిక్కసాని ప్రశాంత లక్ష్మి ( TRS) …
Read More »జడ్చర్ల మున్సిపాలిటీపై ఎగిరిన టీఆర్‌ఎస్ జెండా
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. మొత్తం 27 వార్డుల్లో 19 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్ ఇప్పటివరకు 16 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన …
Read More »కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో …
Read More »నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 1వ వార్డ్ — ఇండిపెండెంట్ విజయం బిక్షం రెడ్డి 2వ వార్డ్ —TRS విజయం సునీల్ 3వ వార్డ్ — TRS విజయం చింత స్వాతి త్రిమూర్తులు 4వ వార్డ్ — CONGRESS విజయం గాజుల సుకన్య 5వ వార్డ్ — LION విజయం వంటేపాక సోమలక్మి 6వ వార్డ్ — TRS విజయం మంగినిపల్లి ధనమ్మ (రాజు) …
Read More »