కరోనాతో పోరులో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఇందుకోసం 11,600 బృందాలను ఏర్పాటు చేసింది.
వీరు కరోనా అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించనున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు.