తన జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపుమేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ గారు మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ని హరిత మయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ లోనే కాకుండా …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈనెల 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1679 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన …
Read More »6 వేల మీటర్ల తవ్వగల స్వదేశీ ఆయిల్ రిగ్గులు
చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి ఎంఈఐఎల్ సొంతంగా తయారు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కలోల్ చమురు …
Read More »ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరుశాతం ఇండ్లకు సరఫరా చేస్తున్నం. ప్రజలను రోగాల నుంచి కాపాడగలుగుతున్నం. ఫలితంగా ప్రజారోగ్యంలో గుణాత్మక మార్పులు వచ్చాయి. అదే సందర్భంలో తల్లీ బిడ్డల సంరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్ పథకం విజయవంతమై, మాతాశిశు సంక్షేమం మెరుగు పడింది. -ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన …
Read More »సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ఇవాళ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read More »సంక్షేమ సంఘాలు కాలనీల అభివృద్ధికి దోహదపడాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి …
Read More »కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం
తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరుకున్నవి. మంగళవారం నాటి జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ …
Read More »మంత్రి మల్లారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు…
ఇటీవలే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన అంతర్రాష్ట్రీయ కబడ్డీ పోటీలను జిల్లా మంత్రి మల్లారెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి గారు గాయపడగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీలు నవీన్ రావు గారు, శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మాధవరం కృష్ణా రావు గారు మంత్రి మల్లారెడ్డి గారిని బోయిన్ పల్లి లోని తన నివాసం వద్ద కలిసి పరామర్శించారు.
Read More »సాగుపై ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, అడిషనల్ కలెక్టర్‌తో పాటు ఆయాశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు …
Read More »కరోనా సమయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ రైతులు శుభవార్త చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కరోనా కారణంగా.. గతేడాదిలాగే కొనుగోలు చేస్తామని, 6,408 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొనుగోలులో కనీస మద్దతు ధర కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు ధాన్యం 17% తేమ మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. వచ్చే వర్షాకాలం 40లక్షల ఎకరాల్లో పత్తి పండించాలన్నారు.
Read More »