తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు గత ఆదివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ‘హైదరాబాద్’ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా, ‘నల్లగొండ’ స్థానంలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల …
Read More »దివంగత ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ నివాళి
తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ …
Read More »అద్భుత రికార్డు.. చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం
తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు కాళేశ్వరం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే నీటి పంపింగ్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింప చేసింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు.. మేఘా సామర్థ్యం తోడవడంతో తెలంగాణ భూములు సస్యశ్యామంగా మారుతున్నాయి. * చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం.. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకంగా రికార్డు నెలకొల్పింది. మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగం ప్రారంభించారు. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ(సభా వ్యవహారాల సంఘం) సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.
Read More »ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలోమంత్రి కేటీఆర్ ఓటేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటేశాను. అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి మద్దతుగా నిలిచాను. విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ …
Read More »టీఆర్ఎస్ కార్యకర్త బిడ్డ పుట్టిన రోజు మంత్రి కేటీఆర్ “సర్ ప్రైజ్ గిఫ్ట్”
కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నగరంలో గత 20 రోజులుగా ఉంటూ, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతోంది. ఈ క్రమంలో ఖాజా నవాజ్ హుస్సేన్ మామ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ పార్టీ అప్పజెప్పిన భాద్యతలను నిర్వర్తించడానికి, ఎన్నికల సమయం కూడా సమీపిస్తుండటంతో అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా హైదరాబాద్ లోనే ఉంటూ …
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 52 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,211 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »దండి యాత్ర అద్భుత ఘట్టం : సీఎం కేసీఆర్
స్వాతంత్ర్య భారత్ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 75 వారాలపాటు ఈ …
Read More »రాజకీయ శక్తులను ఎదుర్కొని రాష్ర్టం సాధించాం : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పడు టీఆర్ఎస్ పార్టీకి మనీ పవర్ లేదు.. మజిల్ పవర్ లేదు.. మీడియా పవర్ లేదు.. మూడు ప్రబలమైన రాజకీయ శక్తులను ఎదుర్కొని కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట్ హరిత ప్లాజాలో తెలంగాణ జీవితం – సామరస్య విలువలపై తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. …
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా 44 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మరో 44 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,159 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రజలు నిర్లక్ష్యంగా చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »