మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా వైరస్ కనపడని శత్రువుగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆటువంటి శత్రువు మొదటగా అవహించేది ఆత్మీయులదేనని ఆయన వాపోయారు. అటువంటి మహమ్మారీ పై యుద్ధం చేస్తున్న మనకు ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడిలో బాగంగా సరిహద్దుల్లో సైనికుల వలె విధులు నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖా సిబ్బంది తో …
Read More »రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
రైతులు పండించిన మక్కల కొనుగోలు లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని వివి.పాలెం(రఘునాధపాలెం మండలం), అల్లీపురం(ఖమ్మం కార్పోరేషన్), లచ్చగూడెం (చింతకాని మండలం), పెద్ద గోపవరం(కొనిజర్ల మండలం) గ్రామాల్లో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు …
Read More »కరోనా వ్యాధి నివారణకు మేము సైతమంటూ గ్రామ మహిళలు
కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మేము సైతమంటూ గ్రామ మహిళా సమాఖ్య సంఘ మహిళలు ముందుకొచ్చారని చిన్నకోడూర్ మండలంలోని మైలారం, గోనెపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామైక్య మహిళా సంఘ సమాఖ్య మహిళా ప్రతినిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఈ మేరకు తమ వంతు సాయంగా సీఏం సహాయ నిధికి విరాళంగా రూ.10వేల రూపాయల చెక్కును మంత్రి స్వీకరించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని …
Read More »మానవతా మూర్తుల సాయం మరువ లేనిది..
కరోనా ప్రభావంతో నిరుపేదల జీవనమే కష్టతరంగా మారుతు.. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పరిస్థితులలో మీకు మీమున్నామంటూ పలువురు మానవతా మూర్తుల సాయం సర్వత్రా ప్రశంశలు పొందుతున్నది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు పేదలను ఆదుకునేందుకు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు గారు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జిల్లాలోని పలువురు …
Read More »గత మార్చి బిల్లు కట్టండి చాలు
కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో వచ్చిన కరెంట్ బిల్లునే ఈ నెల ఆన్‌లైన్ ద్వారా కడితే సరిపోతుందని కస్టమర్లకు తెలియజేసింది. గత మార్చి బిల్లు వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఎస్ఎంఎస్‌ల ద్వారా కస్టమర్లకు పంపిస్తాయని, దాని ప్రకారం ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లిస్తే చాలని టీఎస్ఈఆర్సీ తెలిపింది. లాక్ …
Read More »లాక్ డౌన్ ఒక్కటే మార్గం
వైరస్ వ్యాప్తిని నిరోధించడంతోనే కరోనా నుంచి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మూడు దశల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కన్నా ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగాఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించవచ్చన్నారు. జూన్ మొదటివారానికి దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వెల్లడవుతున్న పలు నివేదికల …
Read More »వైద్యుడికి అండగా
రాష్ట్రంలో కరోనావ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదులకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యంచేస్తామని, వ్యాధి సోకినవారిని కలిసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి క్వారంటైన్ చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రాష్టంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి …
Read More »తెలంగాణలో మరో 12కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. నిన్న బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో పన్నెండు కేసులు నమోదయ్యాయి అని తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎనబై ఎనిమిది కేసులు ఉండగా వీరికి చికిత్సను అందిస్తున్నారు.అయితే బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఒకరు కరోనా వైరస్ తో మృతి చెందారు.
Read More »ఢిల్లీ నుండి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి
మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కరోనా వైరస్ నివారణకు సంబంధిచి జిల్లా కలెక్టర్ హన్మంత రావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుందన్నారు. ఢిల్లీ ప్రార్థనల్లో సంగారెడ్డి జిల్లా నుండి వెళ్లిన 21మందిలో ఫైజాబాద్ నుంచి వచ్చిన వారిని 10 మందిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా క్వారంటైన్‌లో ఉన్న వీరిని …
Read More »దేశానికి దిక్సూచిగా నిలిచిన కేసీఆర్ నాయకత్వం
వలస కూలీలను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన, కరోనా నేపథ్యంలో వారి ఆకలి తీర్చడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ, సినీ, మీడియా ప్రముఖులు ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారు. సంక్షోభ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అని …
Read More »