తెలంగాణ రాష్ట్రంలో నేడు సెలవు దినంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. నేడు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు త్రివర్ణ జెండాను ఎగురవేయనున్నారు.
Read More »బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్
సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …
Read More »కేసీఆర్ ముందే చెప్పినా బీజేపీ నేతలు రెచ్చగొట్టారు: కేటీఆర్
రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని.. ఇప్పుడు ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదని కేసీఆర్ ముందే రైతులకు సూచించారని.. అయినప్పటికీ రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని …
Read More »హైదరాబాద్‌లోకరోనా కిట్స్
హైదరాబాద్‌కు చెందిన ‘హువెల్ లైఫ్ సైన్సెస్’ సంస్థ అరుదైన ఘనత సాధించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపడానికి ఆ సంస్థ అభివృద్ధి చేసిన టెస్ట్ కిట్‌కు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ సంస్థలు తయారుచేసిన మొత్తం 24 కిట్లలో ఆరింటికి మాత్రమే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇందులో హువెల్ లైఫ్ సైన్సెస్ కిట్ కూడా ఉండటం విశేషం. అమెరికా నేషనల్ …
Read More »తెలంగాణ ధిక్కార స్వరం.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు..!
పుట్టుక నీది..చావు నీది.మిగతా బతుకంతా దేశానికే అంటూ..జీవితాంతం తన రచనలలో తెలంగాణ గోసను చిత్రిస్తూ కోట్లాది ప్రజలలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షర యోధుడు, ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి నేడు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా రాష్ట్రమంతటా తెలంగాణ అధికార భాషాదినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓరుగల్లు కీర్తి కిరీటం, ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీ ఓ వ్యక్తి కాదు..ఓ శక్తి…సాహితీ ప్రపంచంలో ప్రజాస్వామ్య ఆకాంక్షగా ప్రజల …
Read More »పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపనున్న తెలంగాణ ప్రభుత్వం
పాడి రైతుల జీవితాల్లో వెలుగులు పూయించేందుకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోనుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా చేయూత ఇవ్వడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపాలి అనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన పాడి పరిశ్రమ రంగంను తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం ప్రణాళికలు వేస్తున్నారని వివరించారు. …
Read More »కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి ఆశ్చర్యపోయిన 15 వ ఆర్దిక సంఘం
తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు వెచ్చిస్తున తీరు పట్ల కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి 15 వ ఆర్దిక సంఘం ఆశ్చర్యపోయింది.దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అవుతుందని ఆర్ధిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా వ్యాఖ్యానించారు. ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం,భారీ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం దేశంలోని అన్నీ రాష్ట్రాలకు …
Read More »అన్నివర్గాల అభివృద్ధే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం..!
రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేట శివారు రావిచెట్టుతండ వద్ద ఆకేరుపై రూ.14.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యాం, బ్రిడ్జి నిర్మాణానికి ఇవాళ ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ … ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, …
Read More »