Home / Tag Archives: Telangana Political News

Tag Archives: Telangana Political News

దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్‌కాట్‌ చేస్తున్నా: కేసీఆర్‌ ఫైర్‌

సమాఖ్య, సహకార స్ఫూర్తిని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని.. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో కేసీఆర్‌ మండిపడ్డారు. గాంధీకి లేని అవలక్షణాలను ఆయనకు అంటగట్టి హేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.90లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం …

Read More »

అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వేర్వేరుగా అమిత్‌షాతో సమావేశమయ్యారు. తెలంగాణ వరద సాయం కోసం అమిత్‌షాను కలిసిన ట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వరదలతో రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ విషయంపై అమిత్‌షాతో చర్చించినట్లు తెలిపారు. పదవుల కోసం వెంటపడే …

Read More »

బీజేపీలో ఈటలది బానిస బతుకు: బాల్క సుమన్‌

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌ అన్నారు. తిన్నింటి వాసాలను ఆయన లెక్కబెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానంద్‌తో కలిసి సుమన్‌ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డాడని.. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. …

Read More »

డాక్టర్లు 3 వారాలు రెస్ట్‌ తీసుకోమన్నారు: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌ స్వల్ప గాయమైంది. ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఆయన ఎడమ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా తెలిపారు. మూడు వారాల పాటు రెస్ట్‌ అవవసరమని వైద్యులు సూచించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ఇవాళ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయ్యింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి’’ అని …

Read More »

సంజయ్‌ను ఈడీ చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు: కేటీఆర్‌ సెటైర్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మరోసారి బీజేపీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈడీ విచారణ సీఎం కేసీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఈడీ చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు. దేశాన్నినడిపిస్తున్న డబుల్‌ ఇంజిన్‌ ‘మోడీ-ఈడీ’ అని దీంతో అర్థమవుతోంది …

Read More »

అప్పుడే లొంగలేదు.. ఇప్పుడు లొంగుతానా?: జగ్గారెడ్డి

తానేం మాట్లాడినా కాంగ్రెస్‌ పార్టీ కోసమేనని.. ఆ పార్టీ లైన్‌లోఏ ఉంటానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని.. పార్టీనుంచి వెళ్లాలనుకుంటే తనను ఆపేదెవరని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా లొంగలేదని.. ఇప్పుడు లొంగుతానా? …

Read More »

రేవంత్‌.. ఎవర్ని కొడతావ్‌? నువ్వేమనుకుంటున్నావ్‌?: మళ్లీ జగ్గారెడ్డి ఫైర్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ ముసలం రేగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా హైదరాబాద్‌ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్‌) ఆయన్ను కలిసి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యశ్వంత్‌సిన్హాను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరూ కలవొద్దని టీపీసీసీ …

Read More »

ముందస్తుకు బీజేపీ సై అంటే.. మేమూ సై!: తలసాని

తాము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడని టీఆర్‌ఎస్‌ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా సిద్ధమేనని చెప్పారు. మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేస్తే ఒప్పుకోబోమని.. సై అంటే సై అంటామన్నారు. బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్‌ వచ్చారని.. …

Read More »

కేసీఆర్‌లాంటి నాయకుడు దేశానికి కావాలి: యశ్వంత్‌సిన్హా

దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ వచ్చిన యశ్వంత్‌ సిన్హా.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటం కాదని.. గుర్తింపు కోసం జరిగేది అసలే కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే …

Read More »

కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని కాదు: కేటీఆర్‌

విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ఉద్దేశించి అన్న మాటలు ఎవరినైనా నొప్పిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని తాను కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar