తెలంగాణలో రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం నడిరోడ్డున పడకూడదు.. ఆ రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం రైతు బీమా. ఈ పథకం కింద రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది . ఈ నేపథ్యంలో రైతు బీమా పథకం కింద అర్హులైన రైతుల సంఖ్య భారీగా పెరగనున్నది. ప్రస్తుత ఆర్థిక …
Read More »2019 రౌండప్-ఫిబ్రవరిలో తెలంగాణ విశేషాలు
ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాము. ఫిబ్రవరి 4న మేలైన పట్టు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఫిబ్రవరి7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్ …
Read More »తెలంగాణలో 2020లో కార్మిక సెలవులు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో పరిశ్రమలు,దుకాణాలు,సూపర్ మార్కెట్లు,ఇతరత్రా వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు/కార్మికులకు ఇవ్వాల్సిన సెలవులను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రకటించింది. సంక్రాంతి (జనవరి15),రిపబ్లిక్ డే(జనవరి 26),మహా శివరాత్రి మరుసటి రోజు( జనవరి22),మే డే(మే1),రంహాన్ (మే 25),తెలంగాణ ఆవిర్భావదినం (జూన్ 2),స్వాతంత్ర్య దినం (ఆగస్టు 15),గాంధీ జయంతి (అక్టోబర్ 2),దసరా(అక్టోబర్25), క్రిస్మస్ (డిసెంబర్ 25) లు ఉన్నాయి. ఈ సెలవులు వేతనంతో కూడిన సెలవులు అని కార్మిక శాఖ …
Read More »సంక్రాంతి పండుగకు ముందే డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
సంక్రాంతి పండుగకు ముందే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎంపికయిన లబ్దిదారులకు సంక్రాంతి పండుగ తర్వాత ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇవాళ అరణ్యభవన్ లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డితో పాటు ఇతర మున్సిపల్ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం …
Read More »అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు సమయంలో ఒక డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు సమయంలో శిశువును బయటకు తీసే సమయంలో పేగును కత్తిరించాలి కానీ అలా చేయకుండా శిశువును తలను కోసేశాడు. దీంతో శిశువు తల లేకుండానే తల్లిగర్భంలో చనిపోయింది. మరోవైపు తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్ …
Read More »తెలంగాణ ఓటర్ల సంఖ్య 2.98కోట్లు
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 2.98కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. జాబితా ప్రకారం వచ్చేడాది జనవరి ఒకటో తారీఖు నాటికి పద్దెనిమిదేళ్ళు నిండిన యువత ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక సవరణ షెడ్యూల్ ను ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే ఏడాది జనవరి పదిహేను తారీఖు వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఈసీ ప్రకటించింది. వచ్చే …
Read More »సమక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..!
వన జాతరకు రంగం సిద్ధమవుతుంది. మేడారం జాతర తేదీలు ఖరారు కావడంతో అన్ని రకాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని పూజారుల సంఘం ప్రకటించింది. అయితే జనవరి 25 నుంచే మేడారంలో సమ్మక్కసారక్క జాతర సందడి మొదలుకానుంది. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ జాతర …
Read More »తెలంగాణ కుంభమేళా…మేడారం జాతర తేదీలు ఇవే..!
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ…మేడారం జాతరకు రంగం సిద్ధమవుతోంది. 13 వ శతాబ్దంలో తమ జాతి కోసం కత్తి పట్టి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన సమ్మక్క, సారలమ్మ శౌర్యపరాక్రమాలకు ప్రతీకగా గిరిజనులు నాలుగు రోజుల పాటు మేడారం జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి..అధికారికంగా నిర్వహిస్తోంది. 2020 వ సంవత్సరం మాఘమాసంలో జరుగబోయే మేడారం జాతరకు …
Read More »దిశ కేసులో షాకింగ్ నిజాలు
తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతటా సంచలనం సృష్టించిన దిశ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు నిందితులు దిశను అతిదారుణంగా అత్యాచారం జరిపి.. ఆ తర్వాత చంపి.. పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి విదితమే. ఈ కేసును చేధించిన పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా కేసును సంఘటన స్థలంలో విచారిస్తుండగా పోలీసులపై నిందితులు దాడికి దిగడంతో ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అయితే …
Read More »మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన కొమురవెల్లి మల్లన్న దేవస్థానం సిబ్బంది
కొమురవెల్లి మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కొమురవెల్లి ఆలయ అధికారులు అర్చకులు అహ్వానించారు . హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మంత్రిని కలిసి అహ్వాన పత్రికను,ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 22 నుంచి మార్చి 23 2020 వరకు జరిగే స్వామి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాల్లో పాల్గోనాలని మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కొమురవెల్లి ఈవో వెంకటేష్ …
Read More »