తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా,ఈ నెల 10న తలపెట్టిన ‘తెలంగాణ బంద్’ను ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. అలాగే ఈ నెల 8 నుంచి BJP తలపెట్టిన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు జీవో 317తో అన్యాయం జరుగుతోందని, దానికి సవరణలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతోపాటు అక్రమ అరెస్టులను నిరసిస్తూ తొలుత బంద్ కి …
Read More »సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి KTR సెటైర్స్
ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 75కే చీప్ లిక్కర్, ఇంకా కుదిరితే రూ.50కే ఇస్తామంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘వావ్… ఏమి పథకం! ఎంత అవమానకరం. ఏపీలో బీజేపీ మరింత దిగజారింది’ అంటూ ఎద్దేవా చేశారు. చీప్ లిక్కర్ను రూ.50కే సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానమా? లేక నిరాశ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమేనా ఈ బంపర్ …
Read More »TBJP అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ‘నిరుద్యోగ దీక్ష’ చేయనున్నారు.భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో ఉ.10-సా. 5గంటల వరకు దీక్ష కొనసాగనుంది. తొలుత ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కరోనా వల్ల ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో దీక్షాస్థలాన్ని పార్టీ కార్యాలయానికి మార్చారు. ఈ దీక్షకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ …
Read More »MLC ఎన్నికలకు BJP దూరం.
తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇతర ముఖ్యనేతలతో సమావేశమై ఈమేరకు చర్చించినట్లు సమాచారం. అభ్యర్థులను నిలబెట్టినా పార్టీకి జిల్లాల్లో ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే ఉత్తమమని బీజేపీ భావిస్తోంది. కాగా, మొత్తం 12 స్థానాల్లో డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.
Read More »బీజేపీని వదిలిపెట్టం.. వెంటాడుతూనే ఉంటం – సీఎం కేసీఆర్
వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సృష్టించిన విధ్వంసంపై సీఎం శ్రీ కేసీఆర్ గారు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నేను నేరుగా అడుగుతున్న. యాసంగిలో నువ్వు వరి వేయమన్నది నిజమా? కాదా?. ఒక వేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలే. నేను …
Read More »కేసీఆర్ ఆగ్రహ జ్వాలల్లో బీజేపీ భస్మం
పుష్కరం పాటు ఒక జాతి మొత్తాన్ని ఏకం చేసి పదమూడేళ్లపాటు మహోద్యమాన్ని నడిపి, ఆ ఉద్యమ ఫలాన్ని అందుకున్న ఏకైక నాయకుడు భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానికి తరువాత ఒక్క కేసీఆర్ మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. ప్రత్యేకరాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రశాంతంగా పాలన చేసుకుంటూ రాష్ట్రాన్ని స్వల్పకాలంలోనే దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి దార్శనికుడు మళ్ళీ మరోసారి ఉద్యమబాట పట్టి కేంద్రం కర్రపెత్తనం మీద …
Read More »తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్ పాలకులు కుట్రలు
తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్ పాలకులు కుట్రలు పన్నుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేసి వ్యవసాయ చట్టాలకు మెలికపెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. నల్లగొండ టౌన్ ఆర్జాల బావి ఐకేపీ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రైతుల కోసం …
Read More »సీఎం KCR మాటతో సిరిసిల్ల రైతు కొత్త బాట
వరి ధాన్యం కొనబోమని కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర సర్కారు అన్నదాతలను ఆదాయం వచ్చే పంటల వైపు మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు పంట మార్పిడికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట, మొర్రాయిపల్లె గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు కొత్త పంటల సాగుకోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. తాజాగా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలువురు రైతులు పంట మార్పిడి చేసుకుంటున్నారు. ఆరుతడి …
Read More »మిషన్ కాకతీయ’ కు స్కొచ్ అవార్డ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ నుంచి బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అవార్డును దక్కించుకున్నది. తాజాగా మరో జాతీయ అవార్డును అందుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ-గవర్నెన్స్ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డ్‌కు ఎంపికయింది. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన స్కోచ్ …
Read More »పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు సాగుతున్నాయి.
రైతన్నల జీవితాలను దుర్భరం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడమే తెలంగాణకు శాపమైంది. విత్తనోత్పత్తికి రాజధానిగా మారడమే తెలంగాణకు పాపమైంది. దినదిన ప్రవర్థమానమై ఎదిగిపోతున్న తెలంగాణపై కేంద్రం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నది.రాష్ట్రం నుంచి వరిధాన్యం కొనేది లేదని తెగేసి చెప్పటంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నా, కేంద్రం ఉదాసీన వైఖరితో సాధ్యం కావడం లేదని బియ్యం …
Read More »