నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ .. నిరాటంకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ప్రారంభిచడాన్ని మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. సంప్రదాయ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి …
Read More »ఓరుగల్లులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్ రోడ్లను, రూ.2 కోట్లతో నిర్మించిన కౌన్సిల్ హాల్‌ను, రంగంపేటలో రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోతననగర్ వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం – సర్కారు దవాఖానాల్లో రూ.5కే భోజనం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పద్దెనిమిది సర్కారు దవాఖానాల్లో రోగుల వెంట వచ్చే సహాయకుల కోసం రూ.5కే రుచికరమైన ఇంటి భోజనం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్ సమక్షంలో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ,హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు …
Read More »యాదాద్రిలో మంత్రి పువ్వాడ అజయ్
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరుపున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు నేడు(19.04.2022)తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయంకు యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారి సమక్షంలో కిలో బంగారాన్ని ఆలయ ఈఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఆలయ …
Read More »GHMC లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మీర్‌ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫైంటెన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఎస్‌టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలాపత్తర్‌లో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పారిశుధ్య కార్మికులకు జీతాలను రూ.8వేల నుంచి రూ.17వేలకు …
Read More »ఈనెల 25న యాదాద్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 25న యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో పునర్నిర్మితమైన అనుబంధ శివాలయ ఉద్ఘాటనపర్వంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి 25 వరకు కొనసాగనుంది. అటు యాదాద్రి ఆలయంలో ఇతర నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు
Read More »SRH బౌలర్ గురించి మంత్రి KTR పోస్టు -సోషల్ మీడియాలో వైరల్
ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట యాబై ఒక్క పరుగులకు ఆలౌటైంది.పంజాబ్ బ్యాటర్స్ లో లివింగ్ స్టోన్ ముప్పై మూడు బంతుల్లో అరవై పరుగుల(5*4,4*6)తో రాణించగా షారూక్ ఖాన్ ఇరవై ఆరు …
Read More »తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు-పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ కలను సాకారం చేసి.. బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకుంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏఫ్రిల్ ఇరవై ఏడున హైటెక్స్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్ రావులతో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం, అస్థిత్వానికి ప్రతీకగా …
Read More »ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునరుత్థానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు. చెడుపై మంచి గెలిచిన రోజని, ప్రేమ, దయ, కరుణాగుణాన్ని సిలువపై తన జీవితం ద్వారా యేసు క్రీస్తు ప్రపంచానికి చాటిచెప్పిన రోజన్నారు. ఒకరిపట్ల ఒకరు ప్రేమతో, దయాగుణంతో వ్యవహరించాలని ఈస్టర్ సందర్భంగా కోరుకున్నారు.
Read More »మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పయనమవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇటీవలే కేంద్రానికి వ్యతిరేకంగా హస్తినలో ధర్నా చేసిన ఆయన.. బీజేపీపై పోరులో భాగంగా రెండు రోజుల్లో మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి వారం రోజులు అక్కడే ఉండి కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన యూపీ వెళ్లి లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చేసే అవకాశం ఉంది.
Read More »