కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువులో చేప పిల్లలు విడుదల చేసి.. జిల్లాలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో నీళ్లు, కరెంటు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మూడేండ్లలోనే దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తిచేసుకొని …
Read More »అందరి సహాకారంతోనే ఆదిలాబాద్ అభివృద్ధి
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ వేత్తలతోపాటు ప్రతి పౌరుని భాగస్వామ్యం ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై మిడిల్ ప్లాంటేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ఎప్పటికీ నిలిచిపోయే ఈ అభివృద్ధి పనుల్లో …
Read More »మంత్రి కేటీఆర్ వినూత్న ట్వీట్
జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్ చేశారు. ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?’ అని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.
Read More »కేంద్ర మంత్రితో మంత్రి తలసాని భేటీ…ఎందుకంటే..?
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి పరుషోత్తం రూపాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు, పథకాలకు కేంద్ర ప్రభుత్వం తరపున మద్దతు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర …
Read More »GHMCలో కొత్తగా 49 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో మరో 49 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,40,030 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి KTR
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు..ఎమ్మెస్సీ చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజినీ అనే మహిళకు అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా మంత్రి కేటీఆర్ ఉద్యోగం ఇప్పించారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ GHMC కమిషనర్ ఆర్డర్ జారీ చేశారు. ఇద్దరు ఆడపిల్లల తల్లి రజినీ రోజువారి కార్మికురాలిగా పనిచేస్తోంది. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఈరోజు ఆమెను …
Read More »అర్హులైన ప్రతి కుటుంబానికి దళితబంధు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన కుటుంబాలకు అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కొత్తగా వివాహం అయినవారికి కూడా పథకం వర్తిస్తుందని తెలిపారు. అకౌంట్లలో పడిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులతోపాటు 65 ఏళ్లలోపు ఉన్న …
Read More »తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 45,274 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 208 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,63,662కు పెరిగింది. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,906కు చేరింది. కొవిడ్ నుంచి 220 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 6,54,765కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు టీఎస్‌ఐసీ ద్వారా ప్రభుత్వం కృషి
యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, డిజైన్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలను పెంపొందిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సొంతంగా ఎదిగేందుకు స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. సెకండ్ ఎడిషన్‌లో భాగం గా టీఎస్‌ఐసీ, విద్యాశాఖ, యునిసెఫ్, యువా, ఇంక్విల్యాబ్ సంయుక్తంగా 50వేల మంది విద్యార్థుల ఆలోచనలను …
Read More »ఐటీ నియామకాల్లో హైదరాబాద్ కు రెండోస్థానం
ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్, పుణె నగరాలు చెరో 18 శాతంతో …
Read More »