హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. అమెరికా వెలుపల రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
Read More »ఎమ్మెల్సీ కవిత కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్..
తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఈరోజు ఎమ్మెల్సీ కవితకు అందజేశారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్.తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణలో ఉన్న అడవులు మరియు చెట్లకు సంబంధించి వేదాలలో ఉన్న విషయాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పుస్తకాన్ని …
Read More »గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కానుక
గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కనుక గా ఈ నెల 16 న రెండో విడత గొర్రెల పంపిణీని నల్లగొండలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ ప్రకటించారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి వెంట పశుసంవర్ధక శాఖా కార్యదర్శి శ్రీ అనిత రాజేంద్ర, డైరెక్టర్ శ్రీ లక్ష్మారెడ్డి, …
Read More »గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి …
Read More »టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు “జీవీఆర్” వితరణ
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ కు చెందిన బాలానగర్ లోని కళ్యాణి నగర్ లో నివాసముండే అవర్నాకుల స్వరూప గుండెకు సంబందించిన మరియు డయాలసిస్ వ్యాధితో బాధపడుతుండేది. నగరంలోని ఫతేనగర్ కి చెందిన అధికార తెరాస నాయకుడు ఎర్రోళ్ల వెంకటేష్ గౌడ్ కూకట్పల్లి తెరాస సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు(GVR) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈరోజు (9/01) వారికీ కూకట్పల్లి తెరాస పార్టీకార్యలయం లో తాత్కాలిక వైద్య ఖర్చులకు గాను …
Read More »త్వరలోనే సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 651 ఉద్యోగాలను రాబోయే మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలకు త్వరలోనే వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. కార్మికుల విభాగంలో ఎలక్ట్రిషన్లు, వెల్డర్ …
Read More »గ్రేటర్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఐదురోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలుకాబోతున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యూసుఫ్‌గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు …
Read More »సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు
లంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఊపిరితిత్తుల్లో మంట కారణంగా నిన్న సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఇవాళ మరికొన్ని పరీక్షలు చేయించుకునేందుకు సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి మధ్యాహ్నం 2:30 గంటలకు వెళ్లనున్నారు. ఎంఆర్ఐ, సిటీస్కాన్‌తో పాటు తదితర పరీక్షలు సీఎం చేయించుకోనున్నారు.
Read More »నిజమవుతున్న శ్రీకాంతాచారి కలలు
తెలంగాణ రాష్ట్రం వస్తేనే పడావు భూములకు పచ్చదనం వస్తుందన్న శ్రీకాంతాచారి కలలు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా గొల్లపల్లిలో కార్యరూపం దాల్చుతున్నాయి. దశాబ్దాలుగా వట్టిపోయిన వాగు జీవనదిలా పారుతున్నది. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. ఉన్న ఊరిలోనే ఉపాధి దొరుకుతుండటంతో వలసలు బందయినయ్. పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైనయ్. తమ బిడ్డకు నివాళిగా గ్రామస్థులు విగ్రహాన్ని ఏర్పాటుచేసుకున్నారు. గొల్లపల్లిని ఆనుకొని ఉన్న యశ్వంతాపూర్ వాగు దశాబ్దాలుగా వట్టిపోయింది. …
Read More »త్వరలో తెలంగాణలో 1400 మంది రేషన్ డీలర్ల నియామకం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్ షాపులకు త్వరలో డీలర్లను నియమిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచి ప్రజలకు, రేషన్ డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని …
Read More »