పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాతృమూర్తి దాసరి మధురవ్వ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మధురవ్వ మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మధురవ్వ అంత్యక్రియలు స్వగ్రామమైన కాసులపల్లి లో ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు.
Read More »ఎమ్మెల్సీ కవిత మానవత్వం
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మానవత్వం చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ నగరం, కంఠేశ్వర్ మీదుగా వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత వెళ్తుండగా.. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలతో పడి ఉన్న మహిళను చూసి చలించిపోయారు. గాయాలతో స్పృహతప్పడి పడిపోయిన మహిళకు ఆమె తెలంగాణ జాగృతి మహిళా నేతలతో కలిసి సపర్యలు చేశారు. అనంతరం ఆమెను వెంటనే సదరు స్థానిక టీఆర్‌ఎస్ నాయకుల సహాయంతో …
Read More »డబుల్ బెడ్రూం ఇండ్లు ఆత్మగౌరవ ప్రతీకలు : మంత్రి హరీష్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇండ్లను హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం తెచ్చారని తెలిపారు. లింగారెడ్డిపల్లి గ్రామస్తులు అదృష్టవంతులు.. …
Read More »కౌన్సిలర్ కూతురికి ఫ్రీ మెడిసిన్ సీటు -మంత్రి హరీశ్ రావు అభినందనలు
సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ గ్యాదరి రవీందర్ కూతురు మనస్విని నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటాలో ఫ్రీ మెడిసిన్ సీటు లభించింది. ఆదివారం కౌన్సిలర్, తన కూతురుతో కలిసి సిద్దిపేటలోని మంత్రి నివాసంలో హరీశ్ రావుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వీట్ తినిపించి, అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మన ప్రాంతం నుంచి కూడా మెడికల్ రంగం …
Read More »ఉద్యోగాల బంగారు గని తెలంగాణ: మంత్రి కేటీఆర్
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ (డీఈఈటీ) ద్వారా ఇకపై యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని యువతకు మరింత వేగవంతంగా ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఉద్యోగులకు లోన్లు, మార్ట్‌గేజ్ వేగంగా జరిపే లక్ష్యంతో అమెరికాకు చెందిన ఎక్విఫాక్స్ సంస్థతో డీఈఈటీ శుక్రవారం ఒప్పందం చేసుకున్నది. దీంతో ఇకపై డీఈఈటీలో నమోదు చేసుకున్న అభ్యర్థుల వెరిఫికేషన్ వేగంగా, పారదర్శకంగా పూర్తవనున్నది. …
Read More »ఉపాధి కల్పన వేదిక డీఈఈటీ
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ’ను (డీఈఈటీ) అందుబాటులోకి తెచ్చింది. కృత్రిమ మేధతో నడిచే ఈ వేదిక నిరుద్యోగులు, కంపెనీల మధ్య సంధానకర్తగా పనిచేస్తున్నది. నిరుద్యోగులు తమ విద్యార్హతలు, ఇతర వివరాలతో డీఈఈటీలో నమోదు చేసుకుంటారు. కంపెనీలు ఆయా వివరాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేసుకుంటాయి. అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు ఈ వేదిక ద్వారా ఆయా కంపెనీల్లోని ఖాళీల వివరాలను …
Read More »మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం
తెలంగాణలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటి సరఫరా లక్ష్యం నెరవేరింది. రాష్ర్టానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందించిన ప్రతిష్ఠాత్మక మిషన్‌భగీరథ పథకం మరో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రజలు తాగడానికి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణను దేశంలోనే రెండోస్థానంలో నిలిపింది. మిషన్ భగీరథ కారణంగా తెలంగాణలో 98.7 శాతం కుటుంబాలకు స్వచ్ఛమైన, శుద్ధిచేసిన మంచినీరు అందుతున్నది. 99.2 శాతంతో బీహార్ మనకంటే ముందున్నది. తెలంగాణలో పట్టణప్రాంతాల్లో 99.4 శాతం, గ్రామాల్లో …
Read More »25వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీలున్నాయి? ఎక్కడ ఎక్కువమంది పనిచేస్తున్నారు? సర్దుబాట్లు పోను ఖాళీల లెక్కపక్కాగా తేల్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకానికి ముమ్మర కసరత్తు మొదలైంది. పాఠశాల విద్యాశాఖలో అన్నిరకాల పోస్టుల కలిపి దాదాపు 25 వేల ఖాళీలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో జిల్లాలవారీగా పదోన్నతులు పోను.. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉన్న ఖాళీలతోపాటు …
Read More »అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్‌షిండే అన్నారు. బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్య పిల్లలను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం మత్స్యకారులను ఆదుకునేందుకు నెల రోజు ల కిందటే చేప పిల్లలను ఉచితం గా విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 24.09 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. …
Read More »1000కోట్లతో ఫియట్ భారీ పెట్టుబడి
హైదరాబాద్ ఐటీ సిగలో మరో చంద్రవంక చేరనున్నది. ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ ఫియట్ తన రెండో మజిలీగా హైదరాబాద్‌ను ఎంచుకొన్నది. ప్రపంచశ్రేణి వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫియట్ తెలంగాణలో తమ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం తమకు సాధ్యపడిందని ఫియట్ సగర్వంగా ప్రకటించింది. 150 మిలియన్ అమెరికన్ డాలర్లతో (రూ.1,110కోట్లు) ఫియట్ గ్లోబల్ హబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్టు …
Read More »