సరిగ్గా ఆరేళ్ళ క్రితం సిద్దిపేట కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట కు హరీశ్ ఆణిముత్యం అనే మాట (10 – 12 -2014 ).. మళ్ళీ నేడు ( 10 – 12 -2020 ) అదే మాట పలకడం లో హరీష్ ఆణిముత్యం అనే మాటకు ఒక ప్రత్యేకత వచ్చింది… – అరేళ్ళల్లో ఆరో సారీ సిద్దిపేట కు సీఎం కేసీఆర్.. సిద్దిపేట కు సీఎం …
Read More »గ్రేటర్ లో 3 రోజులు.. 28,436 మందికి వరద సహాయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వమిస్తున్న రూ.10 వేల సాయం పంపిణీ మూడోరోజు కొనసాగింది. గ్రేటర్ పరిధిలో గురువారం 11,103 మందికి రూ.11.10 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో 17,333 మందికి రూ.17.33 కోట్లు అందింది. గురువారం పంపిణీ చేసిన సాయంతో కలిపి 28,436 మందికి …
Read More »సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు
సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉంది అని సీఎం అన్నారు. ఇది మాములు పేట కాదన్నారు. …
Read More »దుద్దెడలో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
సిద్దిపేట జిల్లా దుద్దెడలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు శుభాభినందనలు తెలిపారు. ఐటీ రంగంలో సిద్దిపేట పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర రాజధానికి సిద్దిపేట అత్యంత సమీపంలో ఉందన్నారు. సిద్దిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. భవిష్యత్‌లో జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పలు …
Read More »తెలంగాణ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
సిద్దిపేట జిల్లా పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా బలమైన పునాదులు వేసుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌లను నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో …
Read More »తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 643 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కు చేరింది. వైరస్ నుంచి తాజాగా 805 మంది కోలుకున్నారు.. ఇప్పటి వరకు 2,66,925 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 1482 మంది మృత్యువాతపడ్డారు. మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉండగా.. దేశంలో …
Read More »నేడు సిద్దిపేటకు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.1200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మర్కూక్ మండలం ఎర్రవల్లి నుంచి సీఎం కేసీఆర్ బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేట శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.20 గంటలకు పొన్నాలలో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11.40 గంటలకు మిట్టపల్లిలో నూతనంగా నిర్మించిన …
Read More »హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
మరికాసేపట్లో శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకోనుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర్శించి కోవిడ్ టీకాలపై చర్చించనున్నారు. టీకాల తయారీపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఈ బృందాలు తిలకించనున్నాయి. టీకాల పురోగతిని తెలుసుకున్న అనంతరం శాస్ర్తవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాయబారులు, హైకమిషనర్లు ఢిల్లీ బయల్దేరనున్నారు. విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో రాష్ట్ర …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం లేఖ రాశారు. పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి ఈ నెల 10న ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండటం గర్వకారణంగా ఉందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వానికి గర్వకారణమని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేపట్టాల్సి ఉండే.. ప్రస్తుతమున్న …
Read More »GHMC Results Update-నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్‌మెట్ ఫలితం వెల్లడి అయింది. నేరెడ్‌మెట్ 136వ డివిజన్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు చేరింది. నిలిచిపోయిన నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని …
Read More »