జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారితో కలిసి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గెలిచిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..
ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు. …
Read More »గ్రేటర్ పోరులో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్
బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్‌ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. …
Read More »ఆశించిన ఫలితం రాలేదు : మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వచ్చిన స్థానాలకు అదనంగా మరో 20 నుంచి 25 స్థానాలు వస్తాయని ఆశించామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని వెల్లడి అయింది. 10 -15 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి …
Read More »తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 596 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,72,719కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1,470కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 8,498 యాక్టివ్ కేసులున్నాయి. 2,62,751 మంది రికవరీ అయ్యారు. గడిచిన 24 …
Read More »భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్‌చెరుల్లో భారీ మెజార్టీ
సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలోనూ గులాబీ గుబాళించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఈ మూడు డివిజన్లలో 4 నుంచి 6వేలకు పైగా ఓట్ల మెజార్టీ టీఆర్‌ఎస్‌కు వచ్చింది. ఈ మూడు డివిజన్లకు మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీలు …
Read More »మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1968లో కాంగ్రెస్ …
Read More »GHMC Results Update-ఇప్పటి వరకు టీఆర్ఎస్ గెలిచిన స్థానాలివే.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. మొత్తం 150 డివిజన్లకు గానూ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 30, ఎంఐఎం 45 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సునీత, యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ గెలుపొందగా, ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేశ్ విజయం సాధించారు. డబీర్‌పురా, మెహిదీపట్నం డివిజన్లలో ఎంఐఎం, …
Read More »GHMC Results Update-మీడియాకు అనుమతివ్వండి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ పలు కౌంటింగ్ సెంటర్ల వద్దకు మీడియాను అనుమతించని పరిస్థితి ఏర్పడింది. కౌంటింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారాన్ని పలువురు మీడియా ప్రతినిధులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన కోర్టు మీడియా ప్రతినిధులకు …
Read More »GHMC Results Update-ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. డిసెంబర్ 1న జరిగిన పోలింగ్‌లో 34,50,331 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో 1926 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. డివిజన్లవారీగా ఆయా పార్టీలకు పోలైన ఓట్ల వివరాలు.. కుకట్‌పల్లి సర్కిల్.. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్- 17 (టీఆర్ఎస్ 8, బీజేపీ 7, చెల్లనివి రెండు ఓట్లు) …
Read More »