Home / SLIDER / భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరుల్లో భారీ మెజార్టీ

భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరుల్లో భారీ మెజార్టీ

సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలోనూ గులాబీ గుబాళించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.

ఈ మూడు డివిజన్లలో 4 నుంచి 6వేలకు పైగా ఓట్ల మెజార్టీ టీఆర్‌ఎస్‌కు వచ్చింది. ఈ మూడు డివిజన్లకు మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్‌, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, చింతా ప్రభాకర్‌, పార్టీ నేతలు బక్కి వెంకటయ్యతోపాటు సిద్దిపేట, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్‌, అందోలు పార్టీ ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

భారతీనగర్‌-111 డివిజన్‌లో సింధూ ఆదర్శ్‌రెడ్డి 4,658, రామచంద్రాపురం-112లో పుష్పానగేశ్‌ 5,759, పటాన్‌చెరు-113లో 6,082 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నాయి.