తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగిస్తున్నాం. సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. కొత్త రాష్ట్రామైన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే జయశంకర్ సార్ ఇచ్చే …
Read More »ప్రొఫెసర్ జయశంకర్ కు మంత్రి పువ్వాడ నివాళులు
తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా ఖమ్మం లో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, వారి ఆలోచనలకు అనుగుణంగానే సీఎం కెసిఆర్ నాయకత్వంలో …
Read More »రేపు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి.. తదితర అంశాల పై కేబినెట్ చర్చించనున్నది.
Read More »తెలంగాణ ఆర్టీసీ కార్గో,పార్సిల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ
టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శివ మానస పుత్రికగా దిన దినాభివృద్ధి చెందుతూ అతి తక్కువ సమయంలోనే టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు వినియోగదారుల ఆదరణ చూరగొనటం సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. సరికొత్త ఆశయం, ఆకాంక్షలతో టి.ఎస్. ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల్ని ప్రారంభించి జూన్ 19 నాటికి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఉద్యోగుల నుంచి …
Read More »సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండ : మంత్రి కేటీఆర్
అమరవీరుడు, కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో కోర్టు చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్‌బాబు చౌరస్తాగా మంత్రి నామకరణం చేశారు. అనంతరం జరిగిన విగ్రహావిష్కరణ …
Read More »మా కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసింది : సంతోష్‌బాబు సతీమణి
సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహం పెట్టాలనే తమ కలను ప్రభుత్వం సాకారం చేసిందని సంతోష్‌బాబు సతీమణి సంతోషి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్‌బాబు సతీమణి పాల్గొని మాట్లాడారు. సంతోష్‌బాబు మరణంతో తమ కుటుంబం కుంగిపోయిందన్నారు. పెద్దదిక్కు కోల్పోయిన …
Read More »తెలంగాణలో కూలీలకు కనీస వేతనం పెంపు..
తెలంగాణలో రోజువారి కూలీలకు కనీస వేతనాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూలీలకు రోజువారి కనీస వేతనం రూ. 300 నుంచి రూ. 390కి పెంచారు. కన్సాలిడేటెడ్ పే వర్కర్ల వేతనం రూ. 8 వేల నుంచి రూ. 10,400కు పెంచారు. పార్ట్‌టైమ్ వర్కర్ల వేతనం రూ. 4 వేల నుంచి రూ. 5,200కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పెంచిన కనీస వేతనం ఈ ఏడాది జూన్ …
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి
కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి కి చర్యలు చేపట్టాలి. కోవిడ్ 19 చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు. 44 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ################# దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు …
Read More »ఈటల రాజీనామాకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి …
Read More »డయాగ్నస్టిక్ హబ్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ఐకే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలలో రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంందించే …
Read More »