వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రజలకు సౌకర్యార్ధం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా …
Read More »మాజీ మంత్రి ఈటలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
పదవులన్నీ అనుభవించి తల్లిలాంటి పార్టీని, తండ్రిలాంటి కేసీఆర్‌ను ఈటల రాజేందర్ మోసం చేశాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గరీబోళ్ల భూములను కబ్జా చేసి, ఫిర్యాదులపై విచారణకు ఆదేశించగానే పార్టీ ఫిరాయించారని విమర్శించారు. నల్ల చట్టాలను చేసిన బీజేపీలో చేరి దొంగలతో దోస్తానా చేశాడని నిప్పులు చెరిగారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి బాల్క సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ …
Read More »మరోసారి మానవతను చాటుకున్న మంత్రి కేటీఆర్
గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.అత్యంత పేదరిక నేపథ్యం నుంచి ఢిల్లీలోని ప్రముఖ లేడి శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఐశ్వర్య రెడ్డి లాక్డౌన్ కాలంలో తన కాలేజీ హాస్టల్ ఫీజులతోపాటు ఆన్లైన్ క్లాసులు హాజరయ్యేందుకు అవసరమైన …
Read More »ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ను కలిసిన సోనూసూద్
ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ను కలిసిన సోనూసూద్..ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల …
Read More »మంత్రి పువ్వాడ తనయుడికి శుభాకాంక్షలు వెల్లువ
తెలంగాణ రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి తనయుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామ రావు గారి దంపతులను, సినీనటుళ్లు నందమూరి తారక రామ రావు గారిని , మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కల్సిన సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పువ్వాడ నయన్ తో …
Read More »సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి మొదట నేరుగా మండేపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. …
Read More »ఐడీటీఆర్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జిల్లాకు చేరుకున్నారు. మొదట తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి, …
Read More »రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ
రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కారేపల్లి మండలం విశ్వనాథపల్లి, తవిసిబోడు గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి పువ్వాడ, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దశలవారీగా ఈ పథకం పేదల దరికి …
Read More »రైతుబంధు సాయం రైతుకే ఇవ్వాలి-బ్యాంకర్లకు మంత్రి హారీష్ ఆదేశం
తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను పాత బాకీల కింద జమచేసుకోకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. వానకాలం సాగుకు పెట్టుబడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే, కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కేభవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావుతో …
Read More »కాళేశ్వరం అద్భుతఘట్టం డిస్కవరీ డాక్యుమెంటరీగా రాబోతుంది..!
కాళేశ్వరం… తెలంగాణ మణిహారం. ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గో‘దారి’నే మళ్లించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని చెప్పొచ్చు. తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో జూన్ 25న రాత్రి 8గంటలకు మన ముందుకు తీసుకొస్తుంది. ఇది సీఎం కేసీఆర్.. ఇంజనీరింగ్ నిపుణుల కృషికి.. యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణంగా …
Read More »