Home / Tag Archives: trs government

Tag Archives: trs government

దేశంలో తొలిసారిగా తెలంగాణ గిరిజన సైనిక్ స్కూల్

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల సిగలో ఒక్కొక్క పువ్వుగా రోజుకో విద్యా సంస్థ కొత్తగా వచ్చి చేరుతుంది. గిరిజన శాఖను మరింత వికసింపజేస్తున్నాయి. తెలంగాణ గిరిజన విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా, విద్యలో వారికి సమాన అవకాశాలే ధ్యేయంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ శాఖలో కొత్తగా పలు విద్యా సంస్థలు మంజూరు అవుతున్నాయి. …

Read More »

మాజీ మంత్రి నాయినికి మంత్రి కేటీఆర్ పరామర్శ

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డిని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారక రామారావు పరామర్శించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి వెళ్లి నాయినిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందించాలని కేటీఆర్‌ డాక్టర్లను కోరారు.

Read More »

టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” దేశంలోనే గొప్ప రాష్ట్రం తెలంగాణ. విద్యుత్ పొదుపు అవార్డులను అందుకున్న వారికి ప్రత్యేక …

Read More »

కష్టపడితేనే పదవులు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు కోసం నియమించిన ఇంఛార్జ్,పార్టీ ప్రధాన కార్యదర్శులతో తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”పార్టీకోసం కష్టపడిన వాళ్లకే పదవులు వస్తాయి.కాస్త అలస్యమైన కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అందరు కల్సి కట్టుగా పనిచేయాలి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై అహర్నిశలు కృషి చేయాలని” …

Read More »

విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

జాతీయ నూతన విద్యావిధానం 2019 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, పటిష్ఠతకు దోహదపడే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఉండేలా ముసాయిదా నివేధికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.   శుక్రవారం సచివాలయంలో విద్యారంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ …

Read More »

కాంగ్రెస్ నేతలకు  హోంమంత్రి నాయిని సవాల్..!!

అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే నెంబర్ వన్ సీఎం అని తేలిందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని  రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పినపాన నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని.. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పెరిగిపోతారని, హిందూ-ముస్లింలు కొట్టుకుంటారని, ఆంధ్రావాళ్లను …

Read More »

మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా..ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న గద్వాల బహిరంగ సభలో ప్రసంగిస్తూ..వచ్చే 2019లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను, …

Read More »

కేసీఆర్ లాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం -అసదుద్దీన్ ఒవైసీ..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లిం వర్గం యొక్క సంక్షేమం, అభివృద్ధికి కేసీఆర్ సర్కారు చేస్తున్న కృషి అమోఘమని ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అందులో భాగంగా ప్రత్యేకించి ముస్లిం సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనకు సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలవంటివి గతంలో ఎన్నడూ జరుగలేదన్నారు. అందుకే తాము సీఎం కేసీఆర్‌కు మద్దతిస్తున్నామని స్పష్టంచేశారు. శనివారం ఇక్కడి శివరాంపల్లిలో అఖిల భారత ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ (ఏఐఎంఈఎస్) పదో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat