Home / Tag Archives: trs party (page 3)

Tag Archives: trs party

మీరు ఆ పదాలను వాడటం సరైనదేనా?: కేటీఆర్‌

కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో విమర్శలు చేశారు. త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సభలో వాడకూడని కొన్ని పదాలంటూ ఇటీవల లోక్‌సభ సెక్రటేరియట్‌ నిషేధించింది. ఈ నేపథ్యంలో మీరు వాడే భాష ఇదా? అంటూ కొన్ని కామెంట్లను పేర్కొంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రధాని నిరసనకారులను ‘ఆందోలన్ జీవి’ అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన …

Read More »

అక్కడ గెలవలేనోళ్లు సిరిసిల్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌లో కొన్ని చోట్ల గొడవలు ఉండడం టీఆర్‌ఎస్‌ బలంగా ఉందనడానికి నిదర్శనం అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌ ఒక్కటే ఉందని ఈ విషయాన్ని కాంగ్రెస్‌, బీజేపీ సర్వేలే స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ దొర అంటూ ప్రతిపక్షాలు …

Read More »

తెలంగాణలో సూపర్‌ స్పీడ్‌ ఇంజిన్‌: కేసీఆర్‌

రూపాయి విలువ పతనమైందంటూ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ గొంతుచించుకుని చెప్పారని.. ఇప్పుడు దాని విలువ ఎందుకు పడిపోయిందో చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. గతంలో ఆయన చెప్పిన విషయాన్నే ఇప్పుడు తాము అడుతున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ అసమర్థ విధానాల వల్లే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి పడిపోయిందని విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ, బీజేపీ నేతలపై …

Read More »

తెలంగాణలో మూడు రోజులు స్కూళ్లు బంద్‌: కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని.. దీనికి యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. మరో 4, 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షసూచన ఉందని.. …

Read More »

ప్రజలు అనవసరంగా రిస్క్‌ తీసుకోవద్దు: సీఎం కేసీఆర్‌

భారీ వర్షాలు కురుస్తున్నందున మహారాష్ట్రతో పాటు తెలంగాణకు రెడ్‌అలర్ట్‌ ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్‌, రెస్క్యూ టీమ్స్‌ను అలర్ట్‌ చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, వరదల …

Read More »

తడి చెత్తతో రూ.6లక్షల ఆదాయం: కేటీఆర్‌ అభినందన

పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …

Read More »

జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు: కేసీఆర్‌ ఆదేశం

రాష్ట్రంలోని భూముల సమస్య పరిష్కారానికి జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి మూడురోజులకు ఒక మండల కేంద్రం చొప్పున 100 టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదస్సుల్లో జేసీ, డీఆర్వో, ఆర్డీవో, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనాలని ఆదేశించారు. మరోవైపు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అవగాహన సదస్సును ఈనెల 11న నిర్వహించనున్నారు. …

Read More »

కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని కాదు: కేటీఆర్‌

విశ్వబ్రాహ్మణులను తాను కించపరిచినట్లు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ఉద్దేశించి అన్న మాటలు ఎవరినైనా నొప్పిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. కులాన్ని తక్కువ చేసే కుసంస్కారిని తాను కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Read More »

కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మ: బాల్క సుమన్‌

విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌నిలదీశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి తెలంగాణకు కిషన్‌రెడ్డి ఒక్క మంచి పనైనా చేయించారా? అని ప్రశ్నించారు. చేతగాని దద్దమ్మగా ఆయన మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డిని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో ఉన్న గుమస్తాలు కూడా గుర్తు పట్టరన్నారు. ‘‘కిషన్‌రెడ్డి తెలంగాణ ద్రోహి. …

Read More »

మీ రియల్‌ అజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనే: కేటీఆర్‌

హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష అజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి లేఖ రాశారు. పార్టీ డీఎన్‌ఏలోనే విద్వేషాన్ని నింపుకొన్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం తమ అత్యాశే అవుతుందన్నారు. మీ పార్టీ సమావేశాల రియల్‌ అజెండా విద్వేషం.. అసలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino