Home / Tag Archives: trs party

Tag Archives: trs party

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు సమ్మె చేసే విధానం నచ్చింది: కేటీఆర్‌

సమ్మె కోసం బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు నచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారని కొనియాడారు. సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బాసర ట్రిపుల్‌ ఐటీని కేటీఆర్‌ సందర్శించారు. విద్యార్థులతో లంచ్‌ చేసి వాళ్లతో గడిపారు. ఈ సందర్భంగా ట్రిపుల్‌ ఐటీలో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘‘రాజకీయ …

Read More »

బెంగళూరులో వరదలు.. కేటీఆర్‌ కౌంటర్‌

బెంగళూరు ఐటీ కారిడార్‌లోని కంపెనీలకు వరదల కారణంగా రూ.225 కోట్ల నష్టం వచ్చినట్లు బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించారు.  పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘‘పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం. నేను చెప్పిన …

Read More »

ప్రగతి భవన్‌ నుంచి మునుగోడు వరకు.. కేసీఆర్‌ భారీ ర్యాలీ

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ మునుగోడులో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మునుగోడులో ‘ప్రజాదీవెన’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌ నుంచి మునుగోడు వరకు భారీ ర్యాలీతో సీఎం వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ప్రగతిభవన్‌ నుంచి ప్రారంభమైన …

Read More »

బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్‌

సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …

Read More »

రూ.80లక్షల కోట్ల అప్పు.. ఎవర్ని ఉద్దరించారు?: కేటీఆర్‌ ఫైర్‌

దేశ సంపదను పెంచే తెలివితేటలు ప్రధాని మోదీ ప్రభుత్వానికి లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సంపదను పెంచి పేదలక సంక్షేమానికి ఖర్చు చేసే మనసు వారికి లేదన్నారు. ఉచిత పథకాలు వద్దంటూ ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదల పొట్ట కొట్టేందుకే ఉచిత పథకాలపై చర్చకు తెరతీశారని కేటీఆర్‌ విమర్శించారు. పేదల …

Read More »

తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కానుక ప్రకటించారు. స్వాతంత్య్ర  వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57 ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి కొత్తగా పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. కొత్తగా మరో 10లక్షల మందికి ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు …

Read More »

దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్‌కాట్‌ చేస్తున్నా: కేసీఆర్‌ ఫైర్‌

సమాఖ్య, సహకార స్ఫూర్తిని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని.. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో కేసీఆర్‌ మండిపడ్డారు. గాంధీకి లేని అవలక్షణాలను ఆయనకు అంటగట్టి హేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.90లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం …

Read More »

కేంద్రమంత్రి సింధియాకు కేటీఆర్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌!

కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు వచ్చి రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తెలంగాణ కంటే సింధియా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో మెరుగైన అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని కేటీఆర్‌ ఛాలెంజ్‌ విసిరారు. దేశ జ‌నాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జ‌నాభా. దేశానికి …

Read More »

మూసీ వరద.. మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాలికి గాయమైన కారణంగా ప్రగతి భవన్‌ నుంచే ఆయన సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని.. …

Read More »

కేసీఆర్‌ నిప్పు.. ఆయన్ను ఎవరూ టచ్‌ చేయలేరు: జగదీష్‌రెడ్డి

కేసీఆర్‌ సీఎం అయ్యాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశం తలసరి ఆదాయం తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. వార్తల్లో ట్రెండింగ్‌ అయ్యేందుకు ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri