బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలను చూస్తే మంత్రిగా, తల్లిగా బాధేస్తోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాసరలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని చెప్పారు. గత రెండేళ్లుగా కొవిడ్ పరిస్థితుల కారణంగా క్లాస్‌లు ప్రత్యక్షంగా జరగకపోవడం, ఇతర చిన్నచిన్న సమస్యలను …
Read More »కులపిచ్చోడు, మత పిచ్చోడు మనకొద్దు: కేటీఆర్
బీజేపీ నేతలు మాట్లాడితే విషం చిమ్ముతున్నారని.. హిందూ ముస్లిం మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉందని, ఎవరెన్ని కూతలు కూసినా పట్టించుకోవద్దని ప్రజలకి సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అనాలోచితమైన నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చేసిందని తీవ్రస్థాయిలో ఆయన …
Read More »ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్‌రావు
‘అగ్నిపథ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోతెలో పీహెచ్‌సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్‌ఎస్ చేయించిందంటూ బండి సంజయ్‌చేసిన ఆరోపణలపై హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …
Read More »దాని అర్థం ‘విశ్వగురు’కే తెలుసు: కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో వ్యంగ్య్యాస్త్రాలు సంధించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలపై విమర్శలు చేశారు. ‘‘రైతు చట్టాలు రైతులకు అర్థంకావు.. సాధారణ ప్రజలకి నోట్ల రద్దు అర్ధం కాదు.. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు.. ముస్లింలకు సీఏఏ అర్థం కాదు.. గృహిణులగా ఉన్న మహిళలకు ఎల్‌పీజీ …
Read More »సంజయ్‌లాంటి నేతల వల్లే దేశంలో అశాంతి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనల వెనుక టీఆర్‌ఎస్ ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలు సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. దేశ రక్షణ కోసం సేవ చేయాలనుకునే యువతను బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. గతంలో రైతన్నలు, ఇప్పుడు సైనికులను నిర్లక్ష్యంగా చూడటం హేయమైన …
Read More »మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రూటే సెపరేటు. మాస్‌కి మాస్ క్లాస్‌కి క్లాస్ అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రజల్లో ఇట్లే కలిసిపోతారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. ఇదే తరహాలో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో కూడా మంత్రి పల్లె ప్రజలతో మమేకం అవుతున్నారు.తాజాగా జిల్లాలోని రాయపర్తి మండలం కాట్రపల్లిలో పల్లె ప్రగతిలో పాల్గొనడానికి బుధవారం బయలు దేరారు. జనగామ జిల్లా …
Read More »కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడు
దేశ కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుచరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు రెండో వర్ధంతి సందర్భంగా సంతోష్ బాబు చిత్రపటానికి మంత్రి ఘన నివాలులర్పించారు.కాసరబాద్ రోడ్డులోని స్మృతి వనంలొ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. …
Read More »ప్రజల్లోకి నేరుగా వెళ్లి సమస్యలను పరిష్కరించడమే పట్టణ ప్రగతి లక్ష్యం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్, వివేకానంద్ నగర్, ఎన్.ఎల్.బి నగర్, రొడామేస్త్రి నగర్ లలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మొక్కలు నాటారు. అనంతరం శ్రీనివాస్ నగర్ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో మిగిలి ఉన్న డ్రైనేజీలు, మంచినీటి లైన్లు పూర్తి చేయాలని …
Read More »కె.శాంతాకుమారికి మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు
ఈ ఏడాది జూన్ 6 నుండి 13 తేదీలలో థాయిలాండ్ లో జరిగిన 14వ ఆసియా వాలీబాల్ మహిళల అండర్ 18 గెటగిరి చాంపియన్ షిప్ లో భారతజట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన కె.శాంతాకుమారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ గురుకుల పాఠశాలలో చదువుకుని, అండర్ 18 కేటగిరి వాలీబాల్ భారత …
Read More »మిగతా వాళ్లకీ బూస్టర్ డోసు ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్
18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్ మాట్లాడారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని …
Read More »