ఈటలరాజేందర్ కు ఓటమి భయం పట్టుకుంది. ఓడిపోతాననే ఫస్ట్రేషన్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడు తున్నడు. అరేయ్.. ఓరేయ్ అంటున్నడు. కూలగొడత, కాలబెడతా అంటున్నాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం వావిలాలలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో ఈటల విపరీత వాఖ్యలు చేస్తున్నారని, ఫస్ట్రేషన్ లో నోరు జారి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు ఏడేండ్లలో కేంద్రంలో …
Read More »TRS విజయగర్జన సభ కోసం స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, టిఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించనుంది. నగర సమీపంలో భారీ ఎత్తున సభను నిర్వహించి విజయవంతం చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నగరంలో శాయంపేట, భట్టుపల్లి, కరీమాబాద్, తిమ్మాపురం శివార్లలోని ఖాళీ స్థలాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణిలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, …
Read More »గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా
సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం తాను హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని చెప్పారు. గాంధీ దవాఖానలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. …
Read More »యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పునః ప్రారంభ ముహూర్త పత్రికను దేవస్థానం ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచాలని సూచించారు. త్రిదండి రామానూజ చినజీయర్ స్వామి స్వదస్తూరితో ముహూర్త పత్రిక రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా 10వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. హోమాన్ని చినజీయర్ స్వామి పర్యవేక్షిస్తారని చెప్పారు. మరికొద్ది సేపట్లో సీఎం …
Read More »యాదాద్రిలో సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు నాయకులను వేద పండితులు ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, …
Read More »దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుంది
హుజూరాబాద్‌లో దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుందని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. దళిత బంధును అడ్డుకున్న ఈటెలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచే రోజు రాబోతుందన్నారు. దళితబంధు కొత్త పథకం కాదని, ఏడాది క్రితమే అమలైందన్నారు. కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం …
Read More »RTC ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్ ఉండగా, ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు. అధిక ధరలు విక్రయించిన ఒక్కో స్టాల్‌కు రూ.1,000 జరిమానాతో నోటీసులు …
Read More »రేవంత్ కు మంత్రి కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఉదయం జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. ఈటల కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని కేటీఆర్ సవాల్ చేశారు. కొంతకాలం తర్వాత ఈటలను …
Read More »సమస్యల పరిష్కారానికే శంకర్ నాయక్ ఉన్నాడు.
మహబూబాబాద్ నుండి గూడూరు పర్యటనకు వెళుతున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు మార్గ మధ్యలో జగన్ నాయకులగూడెం ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వాగతం పలకగా… ఎమ్మెల్యే వారు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో సమస్యలను ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎమ్మెల్యే శంకర్ నాయక్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారం తో పాటు, మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని, …
Read More »మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సిఓలు, డిప్యూటీ సీఇఓలు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పలువురు జిల్లా పరిషత్ ల సిఇఓలు, డిప్యూటీ సీఇఓలు హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం కలిశారు. తమకు పదోన్నతులు కల్పించినందులకు మంత్రికి వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ సకాలంలో అందేవిధంగా పని చేయాలని మంత్రి ఈ సందర్భంగా …
Read More »