హూజూరాబాద్‌లో కారుజోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. బుధవారం వీణవంక మండలం లోని మల్లన్న పల్లి గ్రామానికి చెందిన 15 మంది, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 25 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు టీఆర్ఎస్‌లో చేరారు. వారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి …
Read More »ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పూల పండుగతో తెలంగాణ పులకించిందని, ఎంగిలిపూల బతుమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.’ …
Read More »మంత్రి కేటీఆర్‌ను కల్సిన డీఎంకే ఎంపీలు
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను డీఎంకే ఎంపీలు బుధవారం ఉదయం కలిశారు. నీట్‌పై సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను ఎంపీలు ఎల్ఎం గోవింద్, వీరస్వామి కలిసి కేటీఆర్‌కు అందజేశారు. కేంద్ర విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నామని డీఎంకే ఎంపీలు తెలిపారు. సీఎం స్టాలిన్ రాసిన లేఖ పట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల …
Read More »నవంబర్ 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన తో భారీ బహిరంగ సభ
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం
మల్లన్న సాగర్ లోకి కాలేశ్వరం నీళ్లు 20 టీఎంసీల వరకు రావడంతో రైతు బంధు సమితి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆధ్వర్యంలోమండల ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కాలేశ్వరం నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేశ్వరం నీళ్లతో రైతుల కన్నీళ్ళు తుడిచిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముఖ్యమంత్రి గారి కృషితో బీడు భూములు …
Read More »london లో ఘనంగా చేనేత బతుకమ్మ-దసరా సంబురాలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్‌స్లో మేయర్ బిష్ణు గురుగ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- …
Read More »అడ్డంగా దొరికిపోయిన ఈటల
అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్‌బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ప్రచారం ఒక్కో గ్యాస్‌బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ …
Read More »ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా మంత్రి KTR
ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా నిలుస్తున్నారు మున్సిపల్, ఐటీశాఖా మంత్రి కేటీఆర్. సామాజిక మాధ్యమాల్లో ఆయనకు వస్తున్న విజ్ఞప్తులకు వెంటనే స్పందిస్తూ భరోసా ఇస్తున్నారు. వేడి పాలు ఒంటిపై పడి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారితోపాటు బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతు న్న బాలుడి వైద్యానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన గుండెబోయిన అశోక్, లక్ష్మి దంపతులకు కొడుకు కార్తీక్(11 నెలలు) …
Read More »రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు
దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.. తెలంగాణలో విద్యుత్ కోతలకు ఆస్కారమే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ ఉండదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హైదరాబాద్‌కు …
Read More »సీఎం కేసీఆర్ గొప్ప మనసు-మంత్రి NIranjan Reddy చొరవతో చిన్నారికి సాయం
వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువతికి చికిత్స చేసేందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో యువతి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. బాధితురాలికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా కూడా.. ఈ వ్యాధి కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ …
Read More »