Home / SLIDER / మంత్రి కేటీఆర్‌ను కల్సిన డీఎంకే ఎంపీలు

మంత్రి కేటీఆర్‌ను కల్సిన డీఎంకే ఎంపీలు

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను డీఎంకే ఎంపీలు బుధ‌వారం ఉద‌యం క‌లిశారు. నీట్‌పై సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ‌ను ఎంపీలు ఎల్ఎం గోవింద్, వీర‌స్వామి క‌లిసి కేటీఆర్‌కు అంద‌జేశారు.

కేంద్ర విధానాల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నామ‌ని డీఎంకే ఎంపీలు తెలిపారు. సీఎం స్టాలిన్ రాసిన లేఖ ప‌ట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే నీట్ ర‌ద్దు కోరుతూ పలువురు ముఖ్య‌మంత్రుల‌కు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ లేఖ రాసిన విష‌యం విదిత‌మే.