గులాబీ పార్టీలో నేటి నుంచి సంస్థాగత సంబరం మొదలయ్యిందని టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలను పెంచుతూ ప్రజలను పీడించుకు తింటోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ మతోన్మాదం …
Read More »ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి వేదపండితులతో భూమిపూజ
దాదాపు రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించనున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని కోసం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కాసేపటి క్రితం భూదేవతకు పూజలు ప్రారంభించారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థలంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, …
Read More »జలదృశ్యం నుండి సుజల దృశ్యం..
‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం..’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగింది.ఈ పాట నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ రచించారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్దేశం ముందుగానే ప్రజల్లోకి ఒక సంకేతంగా పంపారు. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందంటూ గులాబీ జెండాను భుజాన పెట్టుకొని ఒక్కడిగా మొదలై కోట్ల జనులను ఏకం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు …
Read More »ట్విట్టర్‌లో 30 లక్షల మార్క్ చేరుకున్న కేటీఆర్
సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో కేటీఆర్ ఒకరు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిత్యం నిమగ్నమయ్యే మంత్రి కేటీఆర్.. ఎవరికీ ఏ ఆపదొచ్చినా క్షణాల్లో స్పందించి, ఆదుకునే గొప్ప నాయకుడు కేటీఆర్. ఎల్లప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. 30 లక్షల మార్క్‌ను చేరుకున్నారు. అంటే ట్విట్టర్‌లో కేటీఆర్ ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 30 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ …
Read More »మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..?
మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్‌కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను ఉద్దేశించి అడిగారు. వీటిలో ఏది ఉపయోగమో ఆలోచించాలని ఓటర్లకు ఆయన సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏండ్లు …
Read More »ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన మంత్రి పువ్వాడ..
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద సెప్టెంబర్ 2న తెరాస పార్టీ జాతీయ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో కలిసి పాల్గొనేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రితో కలిసి బయలుదేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి చేతుల మీదుగా జరిగే భూమి …
Read More »విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రాగిజావ, బెల్లం, మొలకలు
కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ, బెల్లం, లేత మొలకలను అందించనున్నారు. ఇందుకు కేంద్ర విద్యాశాఖ సైతం ఆమోదం తెలిపింది. 2021-22 మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) మినట్స్‌ను ఇటీవలే కేంద్రం విడుదల చేసింది. ఈ ఏడాదికి 16,828 పాఠశాలల్లో 59 రోజులపాటు 7.75 లక్షల మందికి రాగిజావ, 7,277 పాఠశాలల్లో 61 …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్–19కు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది. అయితే తొలిదశలో దీనిని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేశారు. మలిదశలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి …
Read More »త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ఓట్ల కోసం వచ్చే బీజేపీ …
Read More »అగ్రిహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్ హబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, …
Read More »