Home / EDITORIAL / జలదృశ్యం నుండి సుజల దృశ్యం..

జలదృశ్యం నుండి సుజల దృశ్యం..

‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం..’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగింది.ఈ పాట నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రచించారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్దేశం ముందుగానే ప్రజల్లోకి ఒక సంకేతంగా పంపారు. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందంటూ గులాబీ జెండాను భుజాన పెట్టుకొని ఒక్కడిగా మొదలై కోట్ల జనులను ఏకం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు కేసీఆర్‌. సాధించుకున్న తెలంగాణను నేడు అన్నిరంగాల్లో ముందుంచుతున్నారు.

తెలంగాణ కోసం ఎన్నో జెండాలు పుట్టుకొచ్చాయి. కానీ ఏ జెండా నిలబడలేదు. వ్యక్తిగత ఎజెండాతో జెండాలు ఎత్తిన వార తమ ఎజెండా ముగియగానే తెలంగాణ అంశాన్ని గాలికొదిలేశారు. కానీ కేసీఆర్‌ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని చెప్పి 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారు. రాష్ట్ర సాధనకు గులాబీ జెండాను ఎత్తుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో వెక్కిరింతలు, అవమానాలు ఎదుర్కొన్నారు. కొందరైతే.. ‘ఈ బక్క మనిషితో అయితదా అన్నరు. ఈ జెండా ఉండేదా పోయేదా అన్నారు’. కానీ ఈ గులాబీ జెండానే గులాంగిరీని అంతం చేసి తెలంగాణను తెచ్చిపెట్టింది.ఎడేండ్ల కిందటి వరకు పరాయి పాలనలో సొంతింట్లో కిరాయి మనుషులుగా బతికినం. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ పేరెత్తితే ‘ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్కుంటారో చేసుకోండి’ అన్నారు నాటి పాలకులు. నీళ్లు లేక, నిధులు లేక, అణచివేత, వివక్షతో తండ్లాడినం. కరువు తాండవిస్తుంటే, నెర్రెలు బారిన నేలను చూసి గుండెలు బాదుకున్నడు తెలంగాణ రైతన్న. అప్పుల బాధతో పంటలు పండక రైతు ఉరికొయ్యలకు వేలాడుతుంటే ఈ నేల దుఃఖంతో తడిసి ముద్దయింది.

ఆత్మగౌరవంతో బతికే జాతి తెలంగాణ జాతి. ఆత్మగౌరవం దెబ్బ తిన్నప్పుడల్లా ధిక్కార స్వరమై నిలిచింది. నేడు రైతులు, అన్నివర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది మాత్రం ముమ్మాటికి గులాబీ జెండానే. ఈ ఘనత అంతా దాన్ని స్థాపించిన ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. తెలంగాణ జెండా ఎత్తిన్నాడు కేసీఆర్‌ వెంట పిడికెడు మంది లేరు. కానీ కేసీఆర్‌ ఎత్తిన పిడికిల్లకు మూడున్నర కోట్ల పిడికిల్లను జతచేసిండు. ఊరూవాడను ఏకం చేసిండు. పల్లె గల్లీ తిరుగుతూ ప్రజల మనసులు గెలిచిండు. తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి ప్రజలను చైతన్యపరిచిండు. అంగబలం, అర్ధబలం కలిగిన ఆంధ్ర నాయకత్వాలను ఎదిరించి నిలబడ్డాడు. వలస పాలకులు తెలంగాణ వాదాన్ని అణచివేయజూసిన ప్రతిసారి, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిండు. తన పదవులను గడ్డిపోచలుగా వదిలేసి ప్రజల్లో చర్చబెట్టి విజయాలు సాధించిండు. తెలంగాణ వాదాన్ని గెలిపించిండు.

నాడు జలదృశ్యంలో గులాబీ ప్రస్థానాన్ని గుప్పెండు మందితో ప్రారంభించిన కేసీఆర్‌ నేడు కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మాణంతో సుజలదృశ్యాన్ని తెలంగాణలో ఆవిష్కరింపజేశారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచి నీళ్లు అందిస్తున్నారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే ముందు వరుసలో నిలుపుతున్నారు. గులా బీ జెండా ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని తెలంగాణకు విజయం చేకూర్చింది. తెలంగాణ స్వాభిమానాన్ని చాటుతూ, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించింది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది.

వ్యూహచతురతతో పద్నాలుగేండ్ల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించినా, సాధించిన తెలంగాణను సంక్షేమాభివృద్ధిలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిపినా అది కేసీఆర్‌కే చెల్లింది. ఇప్పుడు అడ్డం పొడుగు మాట్లాడుతున్న వారు వాళ్ల పార్టీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ తీరుగ పథకాలు, పాలన ఉన్నాయా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు తెలంగాణ ప్రయోగశాల కాదు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఎంత సేవ చేశామనేదే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశ్వసిస్తారు.

నాటి వలసాంధ్ర పాలనలో టీఆర్‌ఎస్‌ జెండా పట్టుకుంటే అణచివేసే పరిస్థితులను అధిగమించి నేడు ఢిల్లీలో ఆత్మగౌరవ జెండాను ఎగురవేసుకునే స్థితికి చేరుకున్నం. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనానికి భూమి పూజ ఒక చరిత్రాత్మక ఘట్టం. నూతన చరిత్రకు నాంది. టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది సందర్భంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ జరుగుతున్నది. భవిష్యత్‌లో దేశానికి ఈ భవనమే దారిచూపనున్న ది. తెలంగాణ నడిచిన తొవ్వలో దేశం నడుస్తుంది. కేసీఆర్‌ ఎత్తిన గులాబీ జెండా భవిష్యత్‌ భారతావనికి తొవ్వ చూపనున్నది. ఈ సందర్బంగా పల్లెపల్లెన గులాబీ జెండాను ఎగురవేసి తెలంగాణ ఆత్మను ఆవిష్కరిద్దాం.

వ్యాసకర్త
– తెలంగాణా విజయ్..
9491998702
వరంగల్ జిల్లా

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat