కేంద్రంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షులు చౌదరి అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. అజిత్‌సింగ్ మరణంపై వినోద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచిన అజిత్ సింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, తనకు అత్యంత సన్నిహితులన్నారు. మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన …
Read More »తప్పుడు కథనమని ఒప్పుకున్న ఆదాబ్ హైదరాబాద్
ఆగం అయిన ఆదాబ్ హైదరాబాద్..తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటిపై ఇటివల ”జీఓయంఎస్ 67 ను ఉల్లంఘించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ” అంటూ వచ్చిన కథనం తో పొరపాటు దొర్లినట్టు అదాబ్ హైదరాబాద్ పేపర్ యాజమాన్యం దృవీకరించింది. . వారి పేపర్ స్థానిక విలేకరి ఎమ్మెల్యే గారిని కుటుంబ సభ్యులను డబ్బులు అడగగా వారు ఇవ్వకపోవడంతో వారిని …
Read More »ఈటలది అధికార దుర్వినియోగం -ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను తెలిసీ కొనడం ముమ్మాటికీ తప్పేనని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గెస్ట్‌హౌస్‌లో లక్ష్మీకాంతారావు మీడియాతో మాట్లాడారు. పదవులు అడ్డుపెట్టుకొని ఈటల అధికార దుర్వినియోగం చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కొనడమే కాకుండా.. ప్రభుత్వం కొనడం లేదా? అని ప్రశ్నించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. 66 ఎకరాల అసైన్డ్ భూమిని …
Read More »GHMCలో కరోనా కట్టడీపై ఇంటింటి సర్వే
తెలంగాణలో కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి సర్వే బుధవారం కూడా కొనసాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితాను సిబ్బంది నమోదు చేస్తుంది. జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్మికులతో కూడిన మొత్తం 707 బృందాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 41,305 ఇండ్లను సర్వే చేశాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఈ బృందాలు 19,090 మందిని బస్తీ …
Read More »ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు డబ్బులు
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్ రావు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారని తెలిపారు. ధాన్యం …
Read More »ఈటల అలా వ్యాఖ్యానించడం సరికాదు : వినోద్ కుమార్
ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తప్పుబట్టారు. తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా ప్రజా నాయకుడు కేసీఆర్‌ను ఈటల ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ఈటల విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ఆ పథకాలను …
Read More »ఈటల ఒక మేకవన్నె పులి : మంత్రి గంగుల
ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి. బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర. ఆయన హుజురాబాద్‌కు వెళ్తే బీసీ.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డితో, కిరణ్ కుమార్‌రెడ్డితో తాను మాట్లాడాను అని ఈటల చెబుతున్నారు. కేవలం దేవరయాంజల్ భూముల కోసమే ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి …
Read More »కొత్తూరు మున్సిపాలిటిపై ఎగిరిన గులాబీజెండా
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడి అవుతున్నాయి. ఇప్పటికే నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులను కైవసం చేసుకుని గులాబీ జెండా ఎగురవేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. 1వ వార్డు – పి. మాధవి(కాంగ్రెస్) 2వ …
Read More »జడ్చర్ల మున్సిపాలిటీపై ఎగిరిన టీఆర్‌ఎస్ జెండా
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. మొత్తం 27 వార్డుల్లో 19 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్ ఇప్పటివరకు 16 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగిన …
Read More »కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొత్త పార్టీ పెట్టడంపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. గత కొద్ది రోజలుగా ఆయన పార్టీ పెట్టబోతున్నారంటూ హడావుడి జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీపై స్పందించారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనేమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమన్నారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో …
Read More »