ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. వీరు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం వైసీపీలో చేరలేదు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరి, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లు టీడీపీకి దూరంగా …
Read More »ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పేర్ని నాని ఫైర్
సొంత పార్టీ నేతలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు …
Read More »సీఎం జగన్ కు పవన్ వార్నింగ్
బీఎస్-3 వాహనాల కొనుగోళ్లలో తాము మోసగాళ్లం కాదని.. మోసపోయినోళ్లమని టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి అన్నారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నందుకే వైఎస్ జగన్ మమ్మల్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. బాబాయ్‌ని, తమ్ముడిని అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా రివేంజ్ ఉంటుందని హెచ్చరించారు. ‘‘మీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా నన్ను వేధిస్తారేమో’’ అంటూ ఏబీఎన్ న్యూస్ మేకర్ కార్యక్రమంలో పవన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
Read More »జగన్ పై లోకేష్ ఫైర్
ఏపీలో టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని నారా లోకేష్ హెచ్చరించారు. జేసీ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు. జేసీ …
Read More »నేడే జగనన్న చేదోడు పథకం
ఏపీ వ్యాప్తంగా ఈ రోజు బుధవారం జగనన్న చేదోడు పథకం ప్రారంభం కానున్నది.తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆన్ లైన్లో ప్రారంభించనున్నారు.. షాపులున్న రజకులకు,నాయీ బ్రాహ్మణులకు,టైలర్లకు ఏడాదికి రూ.పది వేల చొప్పున అందజేయనున్నారు. ఇందులో భాగంగా తొలివిడతగా 2,47,040మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.ఇందుకు రూ.247.40కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది..
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత
ఏపీ అధికారక పార్టీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతం శిద్ధాతో పాటు ఆయన …
Read More »జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా అమలుకు సీనియర్ అధికారుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు. శ్రీకాకుళం – ఎంఎం నాయక్ విజయనగరం – వివేక్ యాదవ్ విశాఖ – కాటంనేని భాస్కర్ తూర్పు గోదావరి – …
Read More »జైల్లో ఖైదీలను విడుదల చేయాలని సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. కరోనా విపత్తు నేపథ్యంలో జైళ్ళలో ఉన్న ఖైదీలను బెయిల్/పెరోల్ లపై విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా సహాయక చర్యలకై రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించినందుకు అభినందనల తెలిపిన ఆయన ఒక్కో రేషన్ కార్డుకు మీరు ఇస్తానన్న వెయ్యి రూపాయల సహాయం ఏమాత్రం సరిపోదని, నలుగురు ఉన్న ప్రతి కుటుంబానికి రు.10 వేలు ఆర్థిక …
Read More »జగన్ నిర్ణయాలపై భారత దేశమంతా ప్రశంసలు.. తమిళ చానెళ్లలో కధనాలు
ఎప్పుడు వచ్చామో కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ఎక్కడెక్కడ లాక్ డౌన్ విధించారు. దేశమంతటా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది.. ఎవరిని ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు.. ప్రతీ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అధికారులు, ప్రభుత్వాధినేతలు తమ శక్తిమేరకు ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పనిచేస్తున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులంతా కరోనాపై …
Read More »కరోనా విషయంలో వలంటీర్లను అభినందించిన ప్రధాని.. జయహో జగన్
వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. వారి ద్వారా ప్రజలకు సేవలు …
Read More »