ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ మెడికల్ అగ్రీకల్చరల్ ప్రవేశాలకు సంవంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసిన ఆయన.. జూలై 4 నుంచి 8 వరకు ఇంజినీరింగ్, జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నోటిఫికేషన్ విడుదల సమయంలో దరఖాస్తు తేదీలు, ఫీజు వంటి వివరాలు ఉంటాయన్నారు. ఆగస్టులో ఫలితాలు విడుదల …
Read More »ఏపీ అసెంబ్లీ-ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెండ్
ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. వీరిని రెండు రోజుల పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జంగారెడ్డి గూడెంలో సారా మరణాలపై చర్చించాలని పట్టు బడుతూ ఈ రోజు బుధవారం అసెంబ్లీలో చిడతలు వాయిస్తూ నిరసన తెలుపడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభా ఔన్నత్యాన్ని కాలరాస్తున్నారని, రోజురోజుకూ టీడీపీ సభ్యులు దిగజారుతున్నారని స్పీకర్ మండిపడ్డారు. మీరు శాసనసభ్యులే అని …
Read More »ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23 అక్షరాల రూ.2,56,256 కోట్లు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తిరువళ్వార్ సూక్తులతో బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన బడ్జెట్ వివరాలను సభకు వివరించారు. ఇక 2022-23 వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు గా పేర్కొన్నరు మంత్రి బుగ్గన.. రెవెన్యూ వ్యవయం రూ. 2, 08, 261 కోట్లు, మూల ధన వ్యవయం …
Read More »నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం
నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
Read More »చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సలహా
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారని అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘ మాజీ సీఎం నారా చంద్రబాబ నాయుడు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ రెండున్నరేళ్లలో డబ్బు వెదజల్లావు. ఎక్కడ …
Read More »సీఎం జగన్ కు ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. కాపు ఉద్యమానికి సంబంధించిన పలు కేసులు ఎత్తివేయడంపై సంతోషం వ్యక్తం చేసిన ముద్రగడ.. సీఎం జగన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చేయని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ.. గతంలో పెట్టిన కేసులు చాలా అన్యాయమని, ఇప్పుడు వాటిని ఎత్తివేయడం సంతోషం కల్గించిందని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.కాపుజాతి …
Read More »‘ఆంధ్రప్రదేశ్ రాజధాని’ ని తేల్చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావ్ కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే’ అని కూడా కేంద్రం తరఫున మంత్రి …
Read More »నారా లోకేశ్ పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు
ఏపీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే మహిళలపై మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ పీఏ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికీ ఆ పార్టీ సమాధానం చెప్పలేదని హోంమంత్రి సుచరిత అన్నారు. విజయవాడలో 14 ఏళ్ల బాలికను బలితీసుకున్న తెలుగు దేశం పార్టీకి చెందిన నేత వినోద్ బాను కఠినంగా శిక్షిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. వనజాక్షిపై దాడి, కాల్మనీ రాకెట్, రిషితేశ్వరి ఆత్మహత్యపై ఇప్పటికీ ఆ …
Read More »జాతిపితకి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళులు
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Read More »బాబుపై మంత్రి వెల్లంపల్లి ఫైర్
అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారకరామారావు అన్నగారి వారసులమన్న మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే తాము మాత్రం ఆయనపై గౌరవంతో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. నందమూరి తారకరామారావును చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని …
Read More »