Home / Tag Archives: ysrcp (page 57)

Tag Archives: ysrcp

పోలవరం పనులు వేగవంతం చేయాలి

ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20న DDRP (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్వాల్, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్ డిజైన్లను ఆమోదించుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు.

Read More »

వైసీపీకి బాబు సవాల్

ఏపీ  ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం జగన్‌రెడ్డి తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తే మేం కూడా మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తమకు రాష్ట్ర ప్రజలు పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌ ఇప్పుడు ఎందుకు కిక్కురునమనడం …

Read More »

ఏపీలో మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు

ఏపీలోని మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. TGT, PGTలను జోన్ యూనిట్, ప్రిన్సిపాళ్లను స్టేట్ యూనిట్గా బదిలీ చేస్తారు. 2021 నవంబర్ 1 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు కాగా.. 5 ఏళ్ల సర్వీసు పూర్తైన వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయనుండగా.. అర్హులైన టీచర్లు, ప్రిన్సిపాళ్లు తమ దరఖాస్తులను …

Read More »

YSRCP MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి అస్వస్థత

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి అధికార YSRCP MLA ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్కే పాల్గొన్నారు.

Read More »

YSRCP ప్రభుత్వంపై నిర్మాత సురేష్ బాబు అసహనం

ఏపీలో మూవీ టికెట్లపై  వైసీపీ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అన్నారు. ‘అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమని ఆదుకుంటామని చెబుతూనే ఉన్నాయి. ఆ మాటల్లో ఉన్న ఆ సమన్వయం.. చేతల్లో కనిపించడం లేదు. అది మేము గట్టిగా ప్రయత్నించకపోవడం వల్లనా? లేకపోతే వాళ్లు మమ్మల్ని సైడ్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు’ అని చెప్పారు.

Read More »

నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగింది

Ap అసెంబ్లీలో చర్చించడానికి ప్రతిపక్షం వద్ద ఏ అంశాలు లేక దురుద్దేశంతో వ్యవహరించిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీని కౌరవ సభ అని చంద్రబాబు వెళ్లిపోయారని విమర్శించారు. నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగిందని మండిపడ్డారు. సభలో బీసీలు, మైనారిటీల అంశాలతో పాటు వరద నష్టంపై చర్చించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ కూడా ఓపిగ్గా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు.

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే స్కూళ్లలో 20 మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులిచ్చి, అనంతరం మూసివేత ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.

Read More »

బాబుకు ముద్రగడ ఘాటు లేఖ

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …

Read More »

జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయం

ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు

Read More »

ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త

ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధన కాలేజీలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://dme.ap.nic.in/ సైట్ ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు తెలిపారు. 326 పోస్టుల్లో 188 మందిని కొత్తగా నియమిస్తామని.. ఏపీపీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులతో మిగతా 138 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat