ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా స్పీకర్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే స్పీకర్ దంపతులకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న విషయం తెలిసిందే.
Read More »Big Breaking-ఆనందయ్య మందుపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
ఏపీలో కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం …
Read More »ఏపీలో కరోనా కలవరం
ఏపీ కరోనా బులెటిన్ ను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది.ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 91,120 శాంపిల్స్ను పరీక్షించగా.. 18,285 పాజిటివ్ కేసులు వచ్చాయి. 99 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 10,427 మంది మృతి చెందారు. 14,24,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 1,88,40,321 సాంపిల్స్న టెస్ట్ …
Read More »ఓ దృఢ సంకల్పం ఘన విజయం సాధించి నేటికి రెండేళ్లు
రాజకీయ కుట్రలకు ఎదురు నిలిచిన ఆ గుండె ఘన విజయం సాధించి రెండేళ్లు. ఆ గుండె చప్పుడుకు ప్రత్యర్ధి కోటలు బద్దలై ఇప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో ఈ రెండేళ్లలో చూశాం. పారదర్శకతతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చుంటే రాలేదు. …
Read More »మోదీకి జగన్ లేఖ
ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరతతో 45 ఏళ్లు పైబడిన వారికే ఇస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది’ అని జగన్ లేఖలో పేర్కొన్నారు
Read More »RRR నోటికి ప్లాస్టర్’ వేసిన సుప్రీం కోర్ట్
వైసీపీ రెబల్ ఎంపీ “రఘురామరాజు ఎలాంటి ప్రెస్ మీట్ లు పెట్టకూడదు. మీడియాకు, సోషల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ప్రభుత్వం పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలి” అని కండిషన్ బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్ట్. సీఐడీ విచారణకు రఘురామ పూర్తిగా సహకరించాలని, విచారణ అధికారి ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.విచారణకు అధికారి 24 గంటల ముందు నోటీసులివ్వాలని సూచన.న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచన. సీబీఐకి కేసు …
Read More »ఎంపీ RRRకి బెయిల్
ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు 24 గంటల ముందే సీఐడీ నోటీసులివ్వాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది. విచారణకు సహకరించాలని రఘురామను ఆదేశించింది. రఘురామ సోషల్ మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టరాదని తెలిపింది.
Read More »ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 20,937 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,079కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904కు చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »AP 2021-22 వార్షిక బడ్జెట్ హైలెట్స్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, …
Read More »RRRకి పూర్తైన వైద్య పరీక్షలు
వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో తొలి రోజు వైద్య పరీక్షలు ముగిశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు ఆయన్ను సోమవారం రాత్రి 11 గంటలకు తిరుమలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలోని వీఐపీ స్పెషల్ రూమ్‌లో ముగ్గురు ఆర్మీ వైద్య అధికారుల బృందం నేతృత్వంలో ఎంపీకి చికిత్స, అవసరమైన వైద్య పరీక్షలు చేపట్టారు. కస్టడీలో తనపై దాడి జరిగిందని రఘురామరాజు …
Read More »